Tata Sumo 2025: బాలయ్య బండి వచ్చేస్తోంది.. సరికొత్త లుక్, పవర్‌తో టాటా సుమో.. ఇక రోడ్లపై రచ్చరచ్చే..!
Tata Sumo 2025: టాటా మోటర్స్ విశ్వనీయ తయారీ సంస్థ, గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఇదేమాట. కొన్నేళ్ల క్రితం దేశీయ విపణిలో కంపెనీకి చెందిన సుమో ప్రముఖ ఎమ్‌పివిగా అవతరించింది. అలానే ఇది రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిపింది. అయితే వివిధ కారణాల వల్ల దీని అమ్మకాలను నిలిపివేసింది. ప్రస్తుతం టాటా సుమో కొత్త రూపంలో మార్కెట్లోకి వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
న్యూఢిల్లీలో 17 నుంచి 22 వరకు నిర్వహించే ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025’లో కొత్త టాటా సుమో ఎమ్‌పివిని ఆవిష్కరించనున్నట్లు సమాచారం. అయితే దీనిపై కంపెనీ ఎలాంటి రహస్యాన్ని వదలలేదు. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టమైన సమాచారం రానుంది. ఇది మరింత లేటెస్ట్ ఎక్స్‌టీరియర్ డిజైన్‌ను కలిగి ఉండే అవకాశం ఉంది.
ఈ కారులో కొత్త తరహా LED హెడ్‌లైట్లు, ఎల్‌ఈడీ డిఆర్ఎల్, డిఫరెంట్ గ్రిల్, బంపర్, అల్లాయ్ వీల్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్లు ఉంటాయి. కొత్త టాటా సుమో ఎమ్‌పివి శక్తివంతమైన పవర్‌ట్రెయిన్‌ను కలిగి ఉన్నట్లు సమాచారం. ఈ కారు 1.2-లీటర్ పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంటుంది. ఇది మాన్యువల్ గేర్‌బాక్స్ పొందుతుందని కూడా చెబుతున్నారు.
ఇది 20 kmpl మైలేజీని అందిస్తుందని అంచనా. ఈ కారు డజన్ల కొద్దీ ఆకర్షణీయమైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ముఖ్యంగా, ఇది టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ ఎసి, 6-వే పవర్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్‌తో సహా పలు ఫీచర్లను పొందుతుంది. కొత్త టాటా సుమో ఎమ్‌పివి ప్రయాణీకులకు గరిష్ట రక్షణను అందిస్తుంది.
భద్రత పరంగా ఇది 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), 360-డిగ్రీ కెమెరాలను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారును బడ్జెట్ ధరలో రానుంది.
దీని ఎక్స్-షోరూమ్ ధర రూ.8 నుంచి రూ.10 లక్షలు ఉంటుందని అంచనా. 7 లేదా 9 సీట్ల వేరియంట్‌లలో లాంచ్ కావచ్చని అంటున్నారు. రాబోయే టాటా సుమో ఎమ్‌పివిపై కస్టమర్లకు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ కారును టాటా కంపెనీ తిరిగి విక్రయానికి తీసుకొచ్చిన తర్వాత, మధ్యతరగతి ప్రజల ఎంపిక వాహనంగా మారుతుందనడంలో సందేహం లేదు.