Last Updated:

Smartphone Under 10K 2025: రూ.10 వేలలో ఫోన్ కోసం చూస్తున్నారా?.. 50 ఎంపీ కెమెరా, 128 జీబీ స్టోరేజ్.. ఇదిగో ఇవే బెస్ట్ ఆప్షన్స్..!

Smartphone Under 10K 2025: రూ.10 వేలలో ఫోన్ కోసం చూస్తున్నారా?.. 50 ఎంపీ కెమెరా, 128 జీబీ స్టోరేజ్.. ఇదిగో ఇవే బెస్ట్ ఆప్షన్స్..!

Smartphone Under 10K 2025: గత కొన్ని నెలల్లో, అనేక స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌లు రూ. 10,000 ధరలో శక్తివంతమైన 5G హ్యాండ్‌సెట్‌లను విడుదల చేశాయి. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, బ్రాండ్‌లు ఈ ఫోన్‌లను లాంగ్ బ్యాటరీ లైఫ్ ,ఫాస్ట్ ఛార్జింగ్‌తో పాటు సరసమైన ధరతో 5G సపోర్ట్‌తో సహా అనేక శక్తివంతమైన ఫీచర్‌లతో పరిచయం చేశాయి. ఈ ధరలో అందుబాటులో ఉన్న కొన్ని ఉత్తమ 5G స్మార్ట్‌ఫోన్‌ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Moto G35 5G
మోటో G35 5జీ 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.72-అంగుళాల ఫుల్ HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 1,000 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌తో వస్తుంది. దీని ముందు భాగం కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3తో ప్రొటక్ట్‌గా ఉంటుంది.  ఫోన్ 6nm ప్రాసెస్‌పై ఆధారపడి ఉంటుంది.  గ్రాఫిక్స్-ఇంటెన్సివ్ టాస్క్‌ల కోసం దీనిలో Mali-G57 MC4 GPU ఉంది.

స్మార్ట్‌ఫోన్ గరిష్టంగా 4GB LPDDR4x RAM +128GB వరకు UFS 2.2 స్టోరేజ్‌తో వస్తుంది. Moto G35 5G 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్ ఉన్నాయి. ఈ ఫోన్ 4GB RAM + 128GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 9,999 మాత్రమే.

Infinix Hot 50 5G
ఇన్‌ఫినిక్స్ Hot 50 5G 1600 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది మెడిటెక్ డైమన్సిటీ 6300 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది. Mali G57 MC2 GPUని కలిగి ఉంది. ఈ ఫోన్ 48MP సోనీ IMX582 ప్రైమరీ సెన్సార్, డెప్త్ సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్‌తో వస్తుంది.

బ్యాటరీ 5,000mAh, ఇది 18W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. దీని 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.9,999. కాగా, 8GB RAM +128 GB స్టోరేజ్ మోడల్ ధర రూ.10,999.

Poco C75 5G
పోకో C75 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.88-అంగుళాల HD+ డిస్‌ప్లే, గరిష్టంగా 600 nits వరకు బ్రైట్‌నెస్‌ను కలిగి ఉంది. ఇది MediaTek Helio G81 అల్ట్రా ప్రాసెసర్, ARM Mali G52 GPU పై రన్ అవుతుంది. కెమెరా సెటప్‌లో 50MP ప్రైమరీ షూటర్, సెకండరీ సెన్సార్ ఉన్నాయి. ఇది 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5,160mAh బ్యాటరీని కలిగి ఉంది. Poco C75 5G ధర రూ. 7,999, ఇది 4GB + 64GB వేరియంట్‌లో మాత్రమే వస్తుంది.

Vivo T3 Lite
వివో T3 Lite 5G 6.56-అంగుళాల HD+ LCD డిస్‌ప్లేను 90Hz రిఫ్రెష్ రేట్‌తో గరిష్టంగా 840 nits వరకు బ్రైట్‌నెస్‌ని కలిగి ఉంది. ఇది MediaTek డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌పై ఆధారపడి ఉంటుంది. Mali-G57 MC2 GPUతో వస్తుంది.ఈ ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 2MP డెప్త్ సెన్సార్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇది 8MP ఫ్రంట్ కెమెరా, 6GB వరకు LPDDR4x RAM, 128GB వరకు స్టోరేజ్ కలిగి ఉంది, మైక్రో SD కార్డ్ ద్వారా 1TB వరకు పెంచుకోవచ్చు. ఈ ఫోన్  4+128Gb వేరియంట్ ధర రూ.10,499.