Special Trains For Sankranthi: ప్రయాణికులకు గుడ్ న్యూస్..సంక్రాంతికి కొత్త రైళ్లు
South Central Railway to operate Special Trains For Sankranthi: సంక్రాంతికి సొంత గ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అదిరిపోయే శుభవార్త చెప్పింది. సంక్రాంతి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఉన్నా తమ సొంతింటికి వెళ్తుంటారు. ఈ మేరకు ప్రతీ ఏడాది సంక్రాంతి పండుగకు రైల్వే స్టేషన్ వద్ద ప్రయాణికులతో కిక్కిరిసిపోతుంది. ఈ రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించింది.
ఈ మేరకు హైదరాబాద్‌లోని కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు 6 ప్రత్యేక సర్వీసులు నడవనున్నాయి. ఇందులో భాగంగానే కాచిగూడ టూ శ్రీకాకుళం, చర్లపల్లి టూ శ్రీకాకుళం మధ్య సుమారు 6 వరకు ప్రత్యేేక సర్వీసులు నడపనున్నారు. ఈ ప్రత్యేక రైళ్లు జనవరి 11, 12,15,16 తేదీలలో కాచిగూడ నుంచి శ్రీకాకుళం రోడ్ మార్గాల్లో రాకపొకలు చేయనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటన విడుదల చేసింది.
ఈ ప్రత్యేక రైళ్లు.. నల్గొండ తోపాటు మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు,విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, పొందూరు వంటి స్టేషన్‌లలో ఆగనున్నాయి. దీంతో పాటు చర్ల పల్లి టూ శ్రీకాకుళం రోడ్ మార్గాల్లో మరో రెండు ప్రత్యేక రైళ్లు తిరగనున్నాయి. ఈ రైళ్లు జనవరి 8, 9వ తేదీలలో నడవనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. అలాగే కాచిగైడ్ టూ శ్రీకాకుళం రోడ్ మధ్య జనవరి 11, 15వ తేదీలలో నడిచే 07615 రైలు కాచిగూడలో సాయంత్రం 5,45 నిమిషాలు బయలుదేరనుంది. ఈ రైలు శ్రీకాకుళం రోడ్ వద్దకు మరుసటి రోజు ఉదయం 9 గంటల వరకు చేరుకుంటుంది.
మళ్లీ అదే రైలు తిరిగి శ్రీకాకుళం రోడ్ నుంచి కాచిగూడకు జనవరి 12, 16వ తేదీలలో నడవనున్నాయి. ఈ మేరకు శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.45 నిమిషాలకు బయలుదేరనుంది, ఈ రైలు మరుసటి రోజు ఉదయం 7.35 నిమిషాలకు కాచిగూడ్ స్టేషన్‌కు చేరుకోనుంది. ఇక జనవరి 8న నడిచే 07617 రైలు.. చర్లపల్లిలో రాత్రి 7.20 నిమిసాలకు బయలుదేరుతుంది. కాగా, ఈ రైలు మరుసటి రోజు ఉదయం 9గంటల వరకు శ్రీకాకుళం రోడ్ వద్దకు చేరుకుంటుంది. అలాగే జనవరి 9న నడిచే 07618 రైలు.. శ్రీకాకుళంలో మధ్యాహ్నం 2.45 నిమిషాలకు బయలుదేరుతుంది. ఈ రైలు మరుసటి రోజు ఉదయం 6.30 నిమిషాలకు చర్లపల్లి వద్దకు చేరనుంది.