Last Updated:

iPhone Offers: ఆఫర్ చాలా బాగుంది.. ఐఫోన్‌పై రూ.16 వేల డిస్కౌంట్.. దీని ఫీచర్స్ అదుర్స్..!

iPhone Offers: ఆఫర్ చాలా బాగుంది.. ఐఫోన్‌పై రూ.16 వేల డిస్కౌంట్.. దీని ఫీచర్స్ అదుర్స్..!

iPhone 16 Discount Offer: మీరు కూడా ఈ రోజుల్లో కొత్త ఐఫోన్‌ని కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? ఆన్‌లైన్ ఈ కామర్స్ సైట్లు మీ కోసం అద్భుతమైన డీల్స్ తీసుకొచ్చాయి.  ప్రస్తుతం ఆపిల్ కొత్త iPhone 16 ఈ ప్లాట్‌ఫామ్‌లో అతి తక్కువ ధరకు అందుబాటులో ఉంది. ఫ్లాట్ , బ్యాంక్ డిస్కౌంట్లతో డివైజ్ పై రూ.10 నుంచి 16 వేలు ఆదా చేసుకోవచ్చు. గత సంవత్సరం ఆపిల్ తన కొత్త ఐఫోన్ 16 ను సుమారు రూ. 80 వేలకు లాంచ్ చేసింది. అయితే ఇప్పుడు మీరు దానిని రూ. 63,490కి మీ సొంతం చేసుకోవచ్చు. ఈ అద్భుతమైన డీల్ గురించి వివరంగా తెలుసుకుందాం.

iPhone 16 Offers
ఐఫోన్ 16 తగ్గింపు ఆఫర్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ ప్రస్తుతం ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌లో ఎటువంటి బ్యాంక్ ఆఫర్ లేకుండా కేవలం రూ. 73,490కి అందుబాటులో ఉంది. అంటే మీరు ఫోన్‌పై ఫ్లాట్ తగ్గింపు ఆఫర్‌తో రూ. 6,410 ఆదా చేసుకోవచ్చు. ఈ ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్ బ్యాంక్ ఆఫర్‌లతో పాటు అతిపెద్ద తగ్గింపును ఇస్తోంది.

ICICI బ్యాంక్ క్రెడిట్, SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్‌తో కంపెనీ ప్రత్యక్షంగా రూ. 4000 తగ్గింపును అందిస్తోంది, అయితే మీకు IDFC ఫస్ట్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంటే మీరు ఈ మొబైల్‌పై రూ. 10,000 తగ్గింపును పొందవచ్చు. దీని తర్వాత ఫోన్‌ ధర రూ. 63,490 మాత్రమే. అంటే ఈ ఆఫర్‌తో మొబైల్ రూ.16,410 వరకు తగ్గింపును పొందుతోంది.

iPhone 16 Features
ఐఫోన్ 16 ప్రాసెసర్‌లో పెద్ద అప్‌గ్రేడ్‌ను పొందింది. కొత్త A18 చిప్‌సెట్‌తో వస్తుంది. తాజా చిప్‌సెట్ 6-కోర్ CPUతో 3nm టెక్నాలజీతో రన్ అవుతుంది, ఇందులో 2 పెర్ఫార్మెన్స్ కోర్లు,  4 ఎఫిషియెన్సీ కోర్లు ఉన్నాయి. మునుపటి మోడళ్లతో పోలిస్తే iPhone 16 మోడల్‌లు 30శాతం వేగవంతమైన CPU, 40శాతం వేగవంతమైన GPU కలిగి ఉన్నాయని ఆపిల్ తెలిపింది.

ఐఫోన్ 16 ప్రత్యేక యాక్షన్ బటన్‌ను కూడా పొందుతుంది, ఇది గత సంవత్సరం వరకు ప్రో లైనప్‌కు ప్రత్యేకమైనది. కొత్త బటన్‌తో వినియోగదారులు కెమెరాను తెరవడం, ఫ్లాష్‌లైట్, వాయిస్ మెమోలను యాక్టివ్ చేయడం, ట్రాన్స్‌లేట్ చేయడం, మరిన్నింటితో సహా అనేక రకాల ఫీచర్‌లను ఒకే ప్రెస్‌తో యాక్సెస్ చేయవచ్చు.

ఈసారి ప్రారంభించిన నాలుగు iPhone 16 మోడళ్లలో కొత్త ‘కెమెరా కంట్రోల్’ బటన్ కూడా ఉంది, ఇది Apple కొత్త టచ్-సెన్సిటివ్ బటన్‌. ఇది కెమెరా యాప్‌ను లాంచ్ చేయడానికి, ఫోటోలు, వీడియోలను తీయడానికి, జూమ్ ఇన్ , జూమ్ అవుట్ చేయడానికి, ఎక్స్‌పోజర్, డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వంటి ఇతర సెట్టింగ్‌లను సెట్ చేయడానికి ఉపయోగపడుతుంది.