Last Updated:

Maruti Suzuki Discounts: మారుతి అన్నంత పని చేసింది.. డిజైర్‌పై రూ.40000 డిస్కౌంట్.. జనవరి 31 వరకే ఛాన్స్..!

Maruti Suzuki Discounts: మారుతి అన్నంత పని చేసింది.. డిజైర్‌పై రూ.40000 డిస్కౌంట్.. జనవరి 31 వరకే ఛాన్స్..!

Maruti Suzuki Discounts: మారుతి సుజికి ఇండియా తన న్యూ జెన్ డిజైర్‌పై సంక్రాంతి సందర్బంగా భారీ ఆఫర్లు ప్రకటించింది. ఈ నెలలో దీనిపై రూ.40,000 వరకు బెనిఫిట్స్ పొందుతారు. అలానే కంపెనీ ఈ సెడాన్‌పై క్యాష్ డిస్కౌంట్‌తో పాటు స్క్రాపేజ్ బోనస్ కూడా అందిస్తోంది. డిజైర్ దేశంలో నంబర్-1 కారు. కొత్త మోడల్‌ను ప్రవేశపెట్టిన తర్వాత దాని అమ్మకాలు భారీగా పెరిగాయి.

డిజైర్‌ 2023, 2024 మోడల్‌పై ఆఫర్లు ఇస్తుంది. కొత్త మోడల్‌పై ఎలాంటి ఆఫర్ లేదు. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ. 6.79 లక్షలు. వినియోగదారులు ఈ ఆఫర్  ప్రయోజనాన్ని జనవరి 31 వరకు మాత్రమే పొందుతారు. ఈ నెలలో కార్ల ధరలను కూడా కంపెనీ పెంచబోతోంది. డిజైర్‌పై లభించే ఆఫర్లు, డిస్కౌంట్ల గురించి వివరంగా తెలుసకుందాం.

Maruti Suzuki Dzire Offers
1. క్యాష్ డిస్కౌంట్ రూ. 15,000
2. స్క్రాప్‌పేజ్ బోనస్ రూ.25,000

New Zen Maruti Suzuki Dzire Features And Specifications
కొత్త మారుతి సుజికి డిజైర్‌లో కొత్త ఇంటీరియర్ కనిపించనుంది. దీని క్యాబిన్ చాలా విలాసవంతమైనది. ఇందులో వెనుక ఏసీ వెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ కారులో వైర్‌లెస్ ఛార్జర్, డ్యూయల్ ఛార్జింగ్ పోర్ట్‌లు ఉంటాయి. ఇది బ్యాక్ వ్యూ కెమెరాను కలిగి ఉంటుంది, తద్వారా డ్రైవర్ కారును సులభంగా పార్క్ చేయచ్చు. ఇది 9-అంగుళాల ఫ్రీ-స్టాండింగ్ ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్‌ను కలిగి ఉంది.

ఇందులో కొత్తగా డిజైన్ చేసిన డ్యాష్‌బోర్డ్ అందుబాటులో ఉంది. ఈ స్క్రీన్ వైర్‌లెస్ కనెక్టివిటీతో ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లేకి సపోర్ట్ ఇస్తుంది. బాలెనో, గ్రాండ్ విటారా మాదిరిగానే అదే ఆటో క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్‌తో సెంటర్ కన్సోల్ రీడిజైన్ చేశారు. ఇది కాకుండా కొత్త LED ఫాగ్ ల్యాంప్‌ను పొందుతుంది.

దీని ఇంజన్ పవర్‌ట్రెయిన్ గురించి మాట్లాడితే ఇందులో సరికొత్త Z సిరీస్ ఇంజన్ కనిపిస్తుంది, ఇది పాత డిజైర్‌తో పోలిస్తే మైలేజీని గణనీయంగా పెంచుతుంది. ఇందులో ఉన్న సరికొత్త 1.2L Z12E 3-సిలిండర్ NA పెట్రోల్ ఇంజన్ 80బిహెచ్‌పి పవర్,  112ఎనమ్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు.

మైల్డ్ హైబ్రిడ్ సెటప్ ఇందులో కనిపిస్తుంది. ఇందులో 5-స్పీడ్ మ్యాన్యువల్,  5-స్పీడ్ AMT గేర్‌బాక్స్ ఎంపికలు ఉన్నాయి. దాని మైలేజీ గురించి మాట్లాడితే కంపెనీ మాన్యువల్ FE వేరియంట్‌కు 24.80కెఎమ్‌పిఎల్,ఆటోమేటిక్ FE వేరియంట్‌కు 25.75కెఎమ్‌పిఎల్ మైలేజీని ఇస్తుంది.

న్యూ డిజైర్ సేఫ్టీ ఇది హిల్ హోల్డ్ కంట్రోల్, ESP, కొత్త సస్పెన్షన్, అన్ని వేరియంట్‌లకు 6 ఎయిర్‌బ్యాగ్‌లు ఉంటాయి. ఇది క్రూయిజ్ కంట్రోల్, అన్ని సీట్లకు 3-పాయింట్ సీట్‌బెల్ట్‌లు, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ (EBD), బ్రేక్ అసిస్ట్ (BA) వంటి అద్భుతమైన భద్రతా లక్షణాలను కలిగి ఉంది.