Last Updated:

Daaku Maharaj: బాలయ్య ‘డాకు మాహా’రాజ్ ఫస్ట్‌ సింగిల్‌ ప్రొమో రిలీజ్‌

Daaku Maharaj: బాలయ్య ‘డాకు మాహా’రాజ్ ఫస్ట్‌ సింగిల్‌ ప్రొమో రిలీజ్‌

Daaku Maharaj First Single Promo: గాడ్‌ ఆఫ్‌ మాసెస్‌ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రం ‘డాకు మహారాజ్‌’. హిట్‌ డైరెక్టర్‌ బాబీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై నిర్మాత నాగవంశీ నిర్మిస్తున్నారు. హై అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్‌ జరుపుకుంటున్న ఈ చిత్రం విడుదలైన పోస్టర్స్‌, ఆడియో గ్లింప్స్‌ హైప్‌ క్రియేట్‌ చేశాయి.

వచ్చే ఏడాది సంక్రాంతికి జనవరి 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్‌ మూవీ ప్రమోషన్స్‌ స్టార్ట్‌ చేశారు. ఇందులో భాగంగా మ్యూజికల్‌ ప్రమోషన్స్‌ షూరు చేసింది. ఈ సినిమా ఫస్ట్‌ సింగిల్‌ని రెడీ చేసింది. తాజాగా ఈ పాట రిలీజ్‌ డేట్‌ని ప్రకటిస్తూ ప్రోమో రిలీజ్‌ చేసింది మూవీ టీం. ‘డాకూస్ రేజ్‌’ అంటూ విడుదల చేసిన ఈ ప్రోమో ఆద్యాంతం ఆకట్టుకుంటుంది. డేగా.. డేగా.. గుర్రంపై స్వారీ చేసే సింహం ఇదేగా అంటూ సాగిన ఈ పాట మూవీపై మరింత అంచనాలు పెంచుతుంది.

ఇందులో బాలయ్య మ్యానరిజాన్ని పరిచయం చేశారు. ఈ పాటకు తమన్‌ అందించిన మ్యూజిక్‌ మరోసారి బీభత్సం సృష్టిస్తుందనే చెప్పాలి. దీంతో ఫుల్‌ సాంగ్‌ ఎప్పుడెప్పుడా వస్తుందా అని ఆడియన్స్‌ అంతా ఎదురుచూస్తున్నారు. శనివారం (డిసెంబర్‌ 14) ఫుల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేస్తున్నట్టు మేకర్స్‌ ప్రకటించారు. ప్రస్తుతం ఈ సాంగ్‌ ప్రొమో ఆడియన్స్‌ అంచాలను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకువెళ్లింది. కాగా నాకాశ్‌ అజీజ్‌ పాడిన ఈ పాటకు అనంత్‌ శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించారు.