Rashmika Mandanna: ‘నయనం నయనం కలిసే తరుణం’ రష్మిక కోసం విజయ్ దేవరకొండ కవిత్వం, ది గర్లఫ్రెండ్ టీజర్ చూశారా?
The Girlfriend Teaser Out: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం పాన్ ఇండియా, భారీ ప్రాజెక్ట్స్ చేస్తుంది. సౌత్‌లోనే కాదు నార్త్‌లోనూ వరుస పెట్టి సినిమాలు చేస్తుంది. ఇప్పటికే పుష్ప పార్ట్ వన్, యానిమల్ వంటి పాన్ చిత్రాలతో బ్లాక్‌బస్టర్ చూసిన ఆమె తాజాగా పుష్ప 2 మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం పుష్ప 2 సక్సెస్ జోష్‌లో ఉంది. ఇదిలా ఉంటే ఆమె నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ది గర్ల్‌ఫ్రెండ్’. నటుడు రాహుల్ రవింద్రన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేసింది మూవీ టీం. ఇందులో రష్మిక కాలేజ్ స్టూడెంట్‌గా కనిపించనుంది. దీక్షిత్ శెట్టి ఫీమెల్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.
ఈ టీజర్‌కు విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ ఇవ్వడమే కాదు తన స్వయంగా రిలీజ్ చేశాడు. తాజాగా విడుదలైన ఈ టీజర్ విజయ్ దేవరకొండ కవిత్వంతో ఆద్యాంతంగా ఆకట్టుకుంది. రష్మిక తన సూట్‌కేసుతో హాస్టల్‌కి ఎంట్రీ ఇస్తుండగా.. బ్యాగ్రౌండ్ విజయ్ దేవరకొండ కవిత్వం మొదలవుతుంది. “నయనం నయనం కలిసే తరుణం. యెదన పరుగే పెరిగే వేగం. నా కదిలే మనసును అడిగా సాయం. ఇక మీదట నువ్వే దానికి గమ్యం. విసిరిన నవ్వులో వెలుగును చూశా. నవ్వాపితే పగిలే చీకటి తెలుసా.. నీకని మనసును రాసిచ్చేశా. పడ్డానేమో ప్రేమలో బహుశా” అంటూ విజయ్ దేవరకొండ అందమైన కవిత్వంలో టీజర్ సాగింది.
ఇక మధ్యలో రష్మిక, దిక్షిత్‌ల లవ్ ట్రాక్ సీన్స్ బాగా అనిపించాయి. ఇక ఈ టీజర్‌కి విజయ్ దేవరకొండ చెప్పిన కవిత్వం హైలెట్‌గా నిలిచింది. ఓ అమ్మాయితో మొదటి చూపులోనే ప్రేమలో పడిపోయిన ఆ కుర్రాడు తన చూసిన కలిగిన ఫీలింగ్స్‌ని కవిత్వం ద్వారా వర్ణించారు. ఈ కవిత్యం చాలా అందంగా అనిపించింది. టీజర్‌లో రష్మికకు ఒకేఒక్క డైలాగ్ ఉంది. “ఇదేదో పికప్ లైన్ అయితే కాదుగా అస్సలు పడను” అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌తో టీజర్ ముగుస్తుంది. ఈ టీజర్ చూస్తుంటే ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ ఓ ఫీల్ గుండ్ లవ్‌స్టోరీలా సాగనుందని తెలుస్తోంది.