Ola Ride for 180 Meters: వీధి కుక్కల భయనికి 180 మీటర్లకే ఓలా రైడ్ బుక్.. యువతి చేసిన పనికి షాక్..!

A Young Lady Books Ola Ride For Only 180 Meters for Fear Street Dogs: పట్టణాల్లో వీధి కుక్కల బెడద రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. కుక్కల దాడికి భయపడి బయటకు వెళ్లాలంటేనే జంకుతున్నారు. గతంలో వీధికుక్కల దాడితో చాలామంది చిన్నారులు ప్రాణాలు కోల్పోగా.. కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రధాన నగరాల్లో కుక్కల సంఖ్య పెరుగుతోంది.
అయితే, గత కొంతకాలంగా కుక్కల బెడదతో ఇబ్బంది పడుతున్న ఓ యువతికి వచ్చిన ఐడియాను చూసి అందరూ షాక్ అవుతున్నారు. కుక్కల బెడద నుంచి తప్పించుకునేందుకు ఏకంగా ఓలా రైడ్ బుక్ చేసుకుంది. ఆ యువతి ఆఫీస్ వెళ్లి ఇంటికి తిరిగి వస్తుండగా.. ఆమె నివసించే కాలనీలో కుక్కలు కనిపించాయి. దీంతో ఒక్కసారిగా భయంతో వణికిపోయింది. ఇంకా 180 మీటర్లు దూరం వెళ్తే ఇళ్లు వస్తుంది. అయితే కాసేపటి వరకు ఏం చేయాలో తోచలేదు. ఆ తర్వాత ఆ యువతికి సడెన్‌గా మెదడులో ఓ ఆలోచన వచ్చింది. వెంటనే ఆ ఆలోచనను అమలులో పెట్టింది.
ఆ యువతికి వచ్చిన ఆలోచన ఏంటని అనుకుంటున్నారా.. ఏం లేదండీ.. 180 దూరం వెళ్లేందుకు ఫోన్ తీసి అందులో ఓలా రైడ్ బుక్ చేసుకుంది. ఇంతలోనే బైక్ డ్రైవర్ వచ్చాడే. వెంటనే ఓటీపీ అడిగి ఎంటర్ చేయగా.. లోకేషన్ అక్కడే దగ్గరలో చూపించింది. దీంతో ఆశ్చర్యపోయిన ఓలా డ్రైవర్.. మీరు లోకేషన్ కరెక్టుగానే ఎంటర్ చేశారని అడగగా.. అవును అని సమాధారం చెప్పింది. దీంతో మీరు వెళ్లాల్సిన లొకేషన్ అదేనని చూపించాడు. అవును నేను అక్కడికే వెళ్లాలి. అని చెప్పడంతో ఆ డ్రైవర్ షాక్‌కు గురై ఎందుకు అని ప్రశ్నించాడు. ఆ యువతి చెప్పిన మాటలకు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు.
ఈ ప్రాంతంలో కుక్కలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని చూస్తేనే భయం వేస్తుందని చెప్పడంతో ఆ డ్రైవర్ ఆశ్చర్యానికి గురై తనలో తాను నవ్వుకున్నాడు. ఆ తర్వాత సరే అని చెప్పి లోకేషన్ వద్ద జాగ్రత్తగా డ్రాప్ చేశాడు. దీనికి సంబంధించిన విషయాన్ని వీడియో తీశాడు. ఈ వీడియోను @rohitvlogster అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ ఫన్నీగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నిజమే.. కుక్కల బెడద ఎక్కువగా ఉందని, నగరాల్లో కుక్కలు సంచారం చేయకుండా అరికట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
View this post on Instagram