Published On:

King Cobra Vs Cat: పిల్లికి ఎదురుపడిన కింగ్ కోబ్రా.. పడగ విప్పి.. బుసలు కొట్టి ఏం చేసిందో తెలుసా..?

King Cobra Vs Cat: పిల్లికి ఎదురుపడిన కింగ్ కోబ్రా.. పడగ విప్పి.. బుసలు కొట్టి ఏం చేసిందో తెలుసా..?

King Cobra vs Cat Fighting Video Viral: గత కొంతకాలంగా పాములకు సంబంధించిన వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. కొంతమంది ఏకంగా కింగ్ కోబ్రాలతో ఆటలు ఆడడంతో పాటు వాటిని పట్టుకొని విన్యాసాలు చేయడం చేస్తున్నారు. అంతేకాకుండా కింగ్ కోబ్రాకు ఇతర జీవులకు మధ్య ఘర్షణలకు సంబంధించినవి సైతం సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి.

 

అయితే, ఈ వీడియోలో ఓ పిల్లికి అకస్మాత్తుగా కింగ్ కోబ్రా ఎదురుపడుతుంది. ఆ పిల్లిని చూస్తే అమాయంగా ఎటువంటి భయం లేకుండానే అలాగే నిల్చుంటుంది. కింగ్ కోబ్రా మాత్రం పడగ విప్పి.. బుసలు కొడుతోంది. తనపై ఎక్కడ దాడి చేస్తుందోనని పిల్లిపై దాడి చేసేందుకు యత్నిస్తుంది. ఇలా కాసేపు రెండు ఎదురెదురుగా చూసుకుంటున్నాయి. వీడియో చూస్తున్నంత సేపు భీకర ఫైట్ జరుగుతుందని అనుకుంటారు. కానీ పిల్లి మాత్రం ఏం పట్టించుకోకుండా నిశ్శబ్ధంగా వెళ్లిపోతోంది.

 

ఇదిలా ఉండగా, ఈ మధ్య కాలంలో కింగ్ కోబ్రాలు జనాల్లోకి వచ్చేస్తున్నాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కొంతమంది స్నేక్ క్యాచర్‌కు సమాచారం అందించి అడవుల్లోకి వదిలేస్తున్నారు. అలాగే అటవీ శాఖకు సమాచారం అందిస్తున్నారు. అయితే ప్రస్తుతం వీటికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.