Childwood revenge after 50 Years: గెట్-2- గెదర్ లో 50 ఏళ్ళ పగను తీర్చుకున్న తాతయ్య!

Childwood revenge after 50 Years: పాము పగ పడితే ఎన్నాళ్లైనా..ఎలాగైనా దాన్ని సాధిస్తుంది. మరి మనిషి పగ,ప్రతీకారం కూడా పాము కంటే కొన్ని సార్లు తక్కువేం కాదు. ఈ విషయాన్నే ఓ వ్యక్తి నిజం చేసి చూపించాడు. ఎప్పుడో చిన్నప్పుడు అదీ ఫోర్త్ క్లాస్ లో తోటి విద్యార్థి లాగి చెంప మీద కొట్టింది గుర్తుకు పెటుకున్నాడో వ్యక్తి. అంతే 50 ఏళ్ల తరువాత ఆ ప్రతీకారాన్ని సాధించాడు. తన చేతికి చిక్కిన ఫోర్త్ క్లాస్ క్లాస్మేట్ ను చిత్తు చిత్తుగా కొట్టాడు. ఇక ఎంట్రీ ఇచ్చిన పోలీసులు అతనితో పాటు చిన్పప్పుడు కొట్టిన వ్యక్తిని కూడా బొక్కలో వేశారు. దీంతో వీరి 50 ఏళ్ల పగను చూసిన అక్కడి వారు ముక్కున వేలు వేసుకున్నారు.
ఈ విచిత్ర సంఘటన కేరళలోని కసర్గాడ్లో చోటుచేసుకుంది. 54 ఏళ్ల క్రితం.. ప్రస్తుతం 62 ఏళ్లు ఉన్న బాలకృష్ణన్ , వీజే బాబు అనే ఇద్దరు వ్యక్తులు ఒకే బడిలో నాలుగో తరగతిలో క్లాస్మేట్స్. అప్పట్లో వీజే బాబుకి, బాలకృష్ణన్‌కు మధ్య ఓ విషయమై గొడవ జరిగింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన వీజేబాబు బాలకృష్ణన్ చెంప చెల్లుమనిపించాడు. వీజే బాబు కొట్టిన దెబ్బకు బాలకృష్ణన్ ఓ పన్ను విరిగిపోయింది. టీచర్లు మధ్యలో కల్పించుకోవడంతో ఆ రోజు గొడవ సర్దుమణిగిపోయింది. కాని వీజేబాబు, బాలకృష్ణన్ ఆ రోజు నుంచి మాట్లాడుకోవడం మానేశారు. ఇక పన్ను విరిగిపోవడంతో బాలకృష్ణన్ మాత్రం ఈ సంఘటనను మర్చిపోలేదు. దీంతో అతనితో పాటే అతని పగ కూడా పెరుగుతూ వచ్చింది. ఆ పగ తీర్చుకోవడానికి అవకాశం అతనికి దొరకలేదు.
అయితే 54 ఏళ్ల తరువాత మనసులో చెరకుండా దాచుకున్న పగను తీర్చుకునే అవకాశం బాలకృష్ణన్‌కు దొరికింది. ఇటీవల పూర్వ విద్యార్థుల సమావేశం జరిగింది. అక్కడికి బాలకృష్ణన్‌తోపాటు వీజేబాబు కూడా వచ్చాడు. అంతే మనసులో దాచుకున్న పగ ఒక్కసారిగా పెళ్లుబికింది. నాలుగో తరగతిలో నన్నుందుకు కొట్టావని బాలకృష్ణన్.. వీజే బాబుని అడిగాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అది కాస్తా హద్దుమీరడంతో బాలకృష్ణన్, వీజే బాబుపై దాడిచేశాడు. వీజే బాబు కాలర్ పట్టుకుని బలమైన రాయి ఒకటి తీసుకుని అతడి ముఖం, వీపుపై కొట్టాడు బాలకృష్ణన్. ఈ సంఘటన జూన్ 2న జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పలు సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
ఇక బాలకృష్ణన్, వీజే బాబుల ఫైట్ తో పూర్వ విద్యార్థుల సమావేశంలో పాల్లొన్న వారు షాక్‌కు గురయ్యారు. చిన్నప్పటి విషయాన్ని గుర్తుకు పెట్టుకొని ఇప్పుడు కొట్టుకోవడం ఏంటని ఆశ్చర్యపోయారు.