Red Spitting Cobra Video: అరుదైన రెడ్ స్పిట్టింగ్ కోబ్రా.. ఈ రకం పామును ఎప్పుడైన చూశారా..? గాల్లోనే విషం చిమ్మీ దాడి!

Rare Red Spitting Venom King Cobra: పాముల్లో ఎన్నో రకాలు ఉంటాయి. కానీ, మనకు కొన్ని రకాలు పాములు మాత్రమే తెలుసు. కోప్రా, కింగ్ కొప్రాతో పాటు కట్ల పాము, త్రాచు పాము ఇవి మన ఇండియాలో కనిపించే పాములు. కానీ, ప్రపంచవ్యాప్తంగా పలు రకాల అరుదైన జాతి పాములు ఉన్నాయనే విషయం తెలుసా? జియోగ్రఫీ ఛానళ్ ఫాలో అయ్యేవారికి వైల్డ్ లైఫ్ యానిమల్స్ గురించి బాగా తెలుసు. అయితే సాధారణం పాములు ఎన్ని కరకాలైన అవి ఒకేలా ఉంటాయి. కానీ వాటి స్కిన్‌పై మచ్చలు, చారలు ఆధారంగా అవి ఏ జాతి పాము అనేది గుర్తుపడతారు.
అయితే నాగుపాముల్లో కొన్ని రకాలే ఉంటాయి. అందులో ఒకటి కోబ్రా, మరోకటి కింగ్ కొబ్రా. వీటి పడగ ఆధారం అవి ఏ రకమైనదనేది పోల్చుతాము. ఇవి నల్లగా లేదా ముదురు గొధుమ రంగులో ఉంటాయి. మరికొన్ని వైట్, బ్లాక్‌వైట్ చారలతో ఉంటాయి. కానీ గులాబి రంగు నాగుపామును ఎప్పుడైన చూశారా?. అసలు ఇలాంటి పాము ఒకటి ఉందని కూడా తెలిసి ఉండదు కదు. సాధారణం శ్వేత నాగు గురించి విన్నదే కానీ.. అలాంటి పామును మాత్రం ఎప్పుడు చూడలేదు. ఎక్కడో అక్కడ శ్వేతనాగుకు సంబంధించిన వీడియోలు కనిపిస్తుంటాయి. అవి నిజమైన వీడియోలు.. లేక గ్రాఫిక్స్ అనేది క్లారిటీ లేదు. కానీ, తెల్ల నాగుపాము చూసిన వారు చాలా అరుదు. అస్సుల అలాంటి జాతి పాము ఉందా? అని కూడా ఎంతోమందిలో ఇప్పటికీ సందేహం ఉంది.
అయితే తాజాగా గులాబి రంగులో ఓ నాగుపాము వీడియో నెట్టింట దర్శనం ఇచ్చింది. ది వరల్డ్ టూర్ 123(TheWorldtour123) అనే యూట్యూబ్ ఛానల్ వాళ్లు దీనికి సంబంధించిన వీడియోని షేర్ చేశారు. దీనిని రెడ్ స్పిట్టింగ్ కోప్రా అని కూడా పిలుస్తారట. దీనిని భారతదేశంలో కట్ల పాము అని కూడా పిలుస్తారు. అత్యంత ప్రమాదకరమైన పాము. ఈ పాము గురించి తెలిస్తే కనీసం చూట్టు పక్కల వెళ్లడానికి కూడా వణిపోతారు. అంత ప్రమాదకరమైంది ఈ రెడ్ స్పిట్టింగ్ కోబ్రా. ఈ పాములో ఓ ప్రత్యేకత ఉంది. అన్ని పాముల్లా కాకుండ ఇది దూరం నుంచే కాటు వేస్తుందట. అంటే గాల్లో విషం చిమ్మి శత్రువుపై దాడి చేస్తుందట. దానికి ప్రమాదమని తెలిస్తే కొన్న మీట్ల దూరంలోనే నేరుగా శత్రువు కళ్లలో విషం చిమ్ముతుందట.
దీని విషంలో న్యూరోటాక్సిక్ అనే రసాయనాలు ఉంటాయి. ఇది కాటు వేసిన, విషం చిమ్మిన అది మన నాడీ వ్యవస్థపై ప్రభావితం చూపిస్తుంది. ఈ పాము దాడి చేసిన నిమిషాల వ్యవధిలోనే మనిషి లేదా జంతువు రక్తం కక్కుని మరణించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ రెడ్ స్పిట్టింగ్ కోబ్రా పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. విషాన్ని చిమ్ము పాములు శరీరం అన్ని పాముల కంటే కాస్త భిన్నంగా ఉంటుంది. అంతేకాదు ఇది ఎంతో శక్తివంతమైన కండరాలను కలిగి ఉంటాయి. ప్రస్తుతం రెడ్ స్పిట్టింగ్ కోప్రాకి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. దీనిని చూసిన నెటిజన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఇలాంటి పాములు కూడా ఉంటాయా అని షాక్ అవుతున్నారు. గులాబీ కలర్‌లో ఉన్న పామును చూసి కొందరైతే నమ్మలేకపోతున్నారు.