Last Updated:

TTD Mobile App: శ్రీవారి భక్తుల కోసం నూతన యాప్ ‘శ్రీటీటీదేవస్థానమ్స్’.. తిరుమల సమస్త సమాచారం ఈ యాప్ లోనే

భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు తిరుమల దేవస్థానం ‘Sri TTDevasthanams’ పేరుతో మొబైల్‌ యాప్‌ను టీటీడీ

TTD Mobile App: శ్రీవారి భక్తుల కోసం నూతన యాప్ ‘శ్రీటీటీదేవస్థానమ్స్’.. తిరుమల సమస్త సమాచారం ఈ యాప్ లోనే

TTD Mobile App: భక్తులకు మరింత మెరుగైన డిజిటల్‌ సేవలు అందించేందుకు తిరుమల దేవస్థానం ప్రయోగాత్మకంగా ‘Sri TT Devasthanams’ పేరుతో రూపొందించిన మొబైల్‌ యాప్‌ను టీటీడీ

ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి శుక్రవారం ప్రారంభించారు.

భక్తలు కోసం ఇప్పటివరకు గోవింద మొబైల్‌ యాప్‌ ఉండేదని.. దానిని మరింత ఆధునీకరించి నూతన యాప్‌(TTD Mobile App) ను రూపొందించామని తెలిపారు.

ఈ మొబైల్‌ యాప్‌ ద్వారా భక్తులు తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి, అంగప్రదక్షిణ, సర్వదర్శనం, శ్రీవారి సేవ బుక్‌ చేసుకోవచ్చన్నారు.

విరాళాలు కూడా ఇదే యాప్‌ నుంచి అందించవచ్చని తెలిపారు. పుష్‌ నోటిఫికేషన్ల ద్వారా తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉత్సవాల వివరాలు ముందుగా తెలుసుకోవచ్చాన్నారు.

ఇదే యాప్ ద్వారా ఎస్వీబీసీ ప్రసారాలను లైవ్‌ స్ట్రీమింగ్‌ లో చూడవచ్చని తెలిపారు. తిరుమల దేవస్థానం కు సంబంధించిన సమస్త సమాచారం ఈ యాప్‌లో ఉంటుందన్నారు.

భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి ఈ నూతన యాప్ ఉపయోగపడుతుందని చెప్పారు.

జియో సంస్థ సహకారంతో టీటీడీ ఐటీ విభాగం ఈ యాప్‌ను రూపొందించినట్టు వివరించారు.

సామాన్య భక్తులకు స్వామివారి సేవలు, దర్శనం, టికెట్లు, వసతి సులువుగా అందించేందుకు ఆన్లైన్‌ ద్వారా క్లౌడ్‌ టెక్నాలజీని ఉపయోగిస్తున్నామని తెలిపారు.

తద్వారా ప్రతినెలా దర్శనం, సేవలు, శ్రీవాణి టికెట్లతో పాటు తిరుమల, తిరుపతిలో వసతి కూడా ముందుగానే బుక్‌ చేసుకోగలుగుతున్నారని వివరించారు.

నూతన యాప్‌ సేవలపై భక్తుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించి అవసరమైతే మరిన్ని పొందుపరుస్తామని స్పష్టం చేశారు.

బంగారు తాపడం పనులు వాయిదా

శ్రీవారి ఆనంద నిలయం బంగారు తాపడం పనులను వాయిదా వేస్తున్నట్టు వైవీ సుబ్బారెడ్డి(TTD)  తెలిపారు.

5 నుంచి 6 నెలల పాటు పనులను వాయిదా వేస్తున్నామని.. త్వరలో మరో తేదీ నిర్ణయిస్తామని ఆయన వెల్లడించారు.

తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో విమాన గోపురం బంగారు తాపడం పనులను స్థానిక కాంట్రాక్టరు నిర్దేశిత వ్యవధిలో పూర్తి చేయకపోవడంతో ఆలస్యం అవుతోందని చెప్పారు.

తిరుమలలో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండాల అనుకున్న సమయానికి ఆనంద నిలయం బంగారు తాపడం పనులు పూర్తి చేసేందుకు వీలుగా గ్లోబల్‌ టెండర్లకు వెళుతున్నామన్నారు.

ఈ ప్రక్రియకు సమయం పడుతుండడంతో తాపడం పనులను వాయిదా వేశామని తెలిపారు.

భక్తులకు అసౌకర్యం కలగకుండా శ్రీవారి ఆలయంలో తాపడం పనులు పూర్తి చేసేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వివరించారు.

రథసప్తమికి ఏర్పాట్లు పూర్తి

తిరుమలలో శనివారం జరుగనున్న రథసప్తమి(Ratha Saptami) పర్వదినానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఉదయం 5.30 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహన సేవలు మొదలవుతాయని తెలిపారు.

ఉదయం 9 నుంచి 10 గంటల వరకు చిన్నశేష వాహనం
ఉదయం 11 నుంచి 12 గంటల వరకు గరుడ వాహనం
మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల వరకు హనుమంత వాహనం
మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు చక్రస్నానం
సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కల్పవృక్ష వాహనం
సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు సర్వభూపాల వాహనం
రాత్రి 8 నుంచి 9 గంటల వరకు చంద్రప్రభ వాహనసేవలు

 

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి:

https://www.youtube.com/Prime9News
https://www.youtube.com/@Prime9Digital

ప్రైమ్9న్యూస్‌ని ఫాలో అవ్వండి:

Facebook:  https://www.facebook.com/prime9news

Twitter: https://twitter.com/prime9news

Instagram: https://www.instagram.com/prime9news/

 

ఇవి కూడా చదవండి: