Nasik tour: నాసిక్, షిర్టి ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా.. అయితే ఈ ప్యాకేజ్ పై లుక్కేయండి
‘SAI SHIVAM’(సాయి శివం) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఈ టూర్ లో మహారాష్ట్రలోని నాసిక్ మాత్రమే కాకుండా షిర్డీ సాయి సన్నిధిని సందర్శించుకోవచ్చు.
Nasik tour: నాసిక్ వెళ్లాలనుకునే పర్యాటకులకు స్పెషల్ ప్యాకేజీ ప్రారంభించింది ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(ఐఆర్సీటీసీ). హైదరాబాద్ నుంచి నాసిక్ కు ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించింది. ఈ టూర్ లో భాగంగా పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను చూడొచ్చు.
‘SAI SHIVAM’(సాయి శివం) పేరుతో ఈ ప్యాకేజీని తీసుకొచ్చింది ఐఆర్సీటీసీ. ఈ టూర్ లో మహారాష్ట్రలోని నాసిక్ మాత్రమే కాకుండా షిర్డీ సాయి సన్నిధిని సందర్శించుకోవచ్చు. సాయి శివం టూర్ కు సంబంధించిన వివరాలను పేర్కొంది. ఇది 4 రోజులు, 3 రాత్రుల టూర్ ప్యాకేజీ . ప్రస్తుతం ఈ టూర్ ప్యాకేజీ మార్చి 03, 2023 తేదీన అందుబాటులో ఉంది. షెడ్యూల్ చూస్తే కింది విధంగా ఉంటుందియ.
టూర్ ప్యాకేజీ వివరాలివే..(Nasik tour)
మొదటి రోజు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి 6:50 గంటలకు ట్రైన్ బయలుదేరుతుంది. అజంతా ఎక్స్‌ప్రెస్( రైలు నెంబర్ 17064)ను ఎక్కాలి.
రెండో రోజు ఉదయం 7:10 గంటలకు నాగర్‌సోల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. అక్కడ పికప్ వ్యాన్ ద్వారా షిరిడీకి తీసుకెళ్తారు.
ఆ తర్వాత హోటల్‌లో రిప్రెస్ మెంట్స్ అయ్యాక షిరిడీ ఆలయం సందర్శన ఉంటుంది. సాయంత్రం షిరిడీలోని పలు ప్రాంతాలను చూడొచ్చు. రాత్రికి షిర్డి లోనే బస చేస్తారు.
మూడో రోజు షిరిడీ నుంచి నాసిక్ లోని త్రయంబకేశ్వర్ కు వెళ్తారు. అక్కడ పంచవటి దర్శనం ఉంటుంది.
అనంతరం నాగర్‌సోల్ స్టేషన్‌లో రాత్రి 8:30 గంటలకు రైలు ఉంటుంది. రాత్రి మొత్తం జర్నీ ఉంటుంది.
నాల్గో రోజు ఉదయం 8:50 గంటలకు సికింద్రాబాద్ చేరుకోవడంతో సాయి శివం టూర్ ముగుస్తుంది.
టికెట్ ధరలు
సాయి శివర్ టూర్ ప్యాకేజీ ధర చూసుకుంటే.. స్టాండర్డ్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 4940, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 4200 చెల్లించాల్సి ఉంటుంది.
ఒకరి నుంచి ముగ్గురు బుక్ చేసుకుంటే సింగిల్ ఆక్యుపెన్సీకి రూ. 11730, డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 6550, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 4910గా ధర నిర్ణయించారు.
కంఫర్ట్ క్లాస్‌లో నలుగురి నుంచి ఆరుగురు ఈ ప్యాకేజీ బుక్ చేసుకుంటే డబుల్ ఆక్యుపెన్సీకి రూ. 6630, ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ. 5890 చెల్లించాలి.
5 నుంచి 11 ఏళ్ల మధ్య ఉండే పిల్లలకు ప్రత్యేక ధరలు అందుబాటులో ఉన్నాయి. వివరాలకు www.irctctourism.com కు సందర్శించవచ్చు.