Last Updated:

Vivo Y300 Pro Plus: అద్భుతమైన ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌..7300mAh బ్యాటరీతో వచ్చేసింది.. మిస్ కావద్దు..!

Vivo Y300 Pro Plus: అద్భుతమైన ఫీచర్లతో వివో కొత్త స్మార్ట్‌ఫోన్‌..7300mAh బ్యాటరీతో వచ్చేసింది.. మిస్ కావద్దు..!

Vivo Y300 Pro Plus: టెక్ బ్రాండ్ వివో తన Y300 లైనప్‌లో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. Vivo Y300 Pro+ పేరుతో ఈ ఫోన్‌ను కంపెనీ దేశీయ మార్కెట్‌లో విడుదల చేసింది. తక్కువ ధరకే పవర్ ఫుల్ ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. ఈ ఫోన్ హైలైట్ దాని బ్యాటరీ ప్యాక్. ఈ వివో స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్‌లు, ధర, ఇతర వివరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

 

Vivo Y300 Pro Plus Specifiications
Vivo Y300 Pro+ స్మార్ట్‌ఫోన్‌లో 6.77-అంగుళాల అమోలెడ్ డిస్‌ప్లే ఉంది, దీని రిఫ్రెష్ రేట్ 120Hz. ఈ డిస్‌ప్లే HDR10+, FHD+ రిజల్యూషన్, 5000 నిట్స్ వరకు బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ వివో ఫోన్‌లో క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 చిప్‌సెట్ ఉంది. ఇందులో 12జీబీ ర్యామ్, 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌‌తో వస్తుంది.
ఫోటోగ్రఫీ గురించి చెప్పాలంటే ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఇచ్చారు. ఈ ఫోన్ మెయిన్ కెమెరా 50MP సోనీ IMX882 సెన్సార్. ఈ ఫోన్‌లో 2MP డెప్త్ సెన్సార్ ఉంది. సెల్ఫీ,వీడియో కాలింగ్ కోసం ఫోన్‌లో 32MP సెల్ఫీ కెమెరా ఉంది.

 

Vivo Y300 Pro+ స్మార్ట్‌ఫోన్‌లో 7300mAh బ్యాటరీ ఉంది, ఇది 90W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. కమర్షియల్ ఫోన్‌లో తొలిసారిగా ఈ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ అందించారు. దీనితో పాటు ఫోన్‌లో బ్లూటూత్ 5.2, స్టీరియో స్పీకర్, ఎన్‌ఎఫ్‌సి, డ్యూయల్ సిమ్ (నానో + నానో), వైఫై 6, ఆరా లైట్ ఎల్‌ఈడి రింగ్, ఆండ్రాయిడ్ 15 ఆధారిత ఒరిజిన్‌ఓఎస్ 15 కస్టమ్ స్కిన్ ఉన్నాయి.

 

Vivo Y300 Pro Plus Price
Vivo Y300 Pro+ స్మార్ట్‌ఫోన్‌ను స్టార్ సిల్వర్, సింపుల్ బ్లాక్, మైక్రో పింక్ రంగుల్లో విడుదల చేశారు. వివో ఈ ఫోన్ నాలుగు వేరియంట్లలో మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ మొదటి వేరియంట్ 8 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్‌తో వస్తుంది. దీని ధర 1799 యువాన్ (సుమారు రూ. 21 వేలు). ఈ ఫోన్ రెండవ వేరియంట్ 256 జీబీ స్టోరేజ్‌తో 8జీబీ ర్యామ్‌తో విడుదలైంది. దీని ధర 1999 యువాన్ (సుమారు రూ. 23 వేలు). 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్‌తో మూడవ వేరియంట్ 2199 యువాన్లకు (సుమారు రూ. 26 వేలు) విడుదల చేసింది. ఫోన్ నాల్గవ వేరియంట్ 12 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్‌తో 2499 యువాన్ (దాదాపు రూ. 29 వేలు) ధరతో వస్తుంది.