Last Updated:

Vivo V50e: అడ్వాన్స్ కెమెరా ఫీచర్స్.. వివో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ లీక్..!

Vivo V50e: అడ్వాన్స్ కెమెరా ఫీచర్స్.. వివో కొత్త ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ లీక్..!

Vivo V50e: వివో V50 సిరీస్ చౌకైన ఫోన్ త్వరలో భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ లైనప్‌లోని రెండవ ఫోన్‌ను దేశంలో విడుదల చేయడానికి కంపెనీ సన్నాహాలు చేస్తోంది. ఈ రాబోయే ఫోన్ Vivo V50e పేరుతో లాంచ్ కానుంది. దీనికి సంబంధించిన కొన్ని వివరాలు వెల్లడయ్యాయి. ఈ విషయాన్ని స్వయంగా కంపెనీ తన అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. అయితే రాబోయే V50e స్మార్ట్‌ఫోన్ గురించి కంపెనీకి ప్రస్తుతం ఎక్కువ సమాచారం అందుబాటులో లేదు. ఏప్రిల్ మధ్యలో ఈ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది.

రాబోయే Vivo V50e స్మార్ట్‌ఫోన్ సఫైర్ బ్లూ, పెరల్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో విడుదల అవుతుందని కంపెనీ మైక్రోసైట్ వెల్లడించింది. ఈ ఫోన్ డిజైన్ Vivo V50 లాగా ఉంటుంది. కెమెరా సెటప్ గురించి మాట్లాడితే.. ఈ ఫోన్‌లో OIS మద్దతుతో సోనీ IMX882 ప్రైమరీ సెన్సార్‌ ఉంటుంది. దీనితో పాటు ఫోన్ అల్ట్రా-వైడ్ యాంగిల్ లెన్స్, ఆరా LED ఫ్లాష్‌ ఉంటుంది. ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది.

ఈ ఫోన్ ముందు, వెనుక కెమెరా సెన్సార్లు 4K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ ఇస్తాయని వివో ధృవీకరించింది. దీనితో పాటు వెడ్డింగ్ ఫోటోగ్రఫీ మోడ్ కూడా ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. ఫోన్ సోనీ మల్టీఫోకల్ ప్రో పోర్ట్రెయిట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది 3 వేర్వేరు ఫోకల్ లెంగ్త్‌లలో ఫోటోలను క్యాప్చర్ చేస్తుంది. వివో ఈ ఫోన్ నీటి అడుగున ఫోటోగ్రఫీని కూడా చేయగలదు.

రాబోయే స్మార్ట్‌ఫోన్ డస్ట్, వాటర్ రెసిస్టెంట్ కోసం IP68, IP69 రేటింగ్‌లను పొందుతుంది. దీనితో పాటు, ఫోన్ డైమండ్ షీల్డ్ గ్లాస్ రక్షణతో SGS 5-స్టార్ డ్రాప్ సర్టిఫికేషన్ సపోర్ట్ ఇస్తుంది. ఈ వివో ఫోన్‌లో అనేక AI ఫీచర్లు కూడా అందుబాటులో ఉంటాయి. ఇమేజ్ ఎక్స్‌పాండర్, మ్యాజిక్ ఎరేజర్, నోట్ అసిస్ట్, ట్రాన్‌స్క్రిప్ట్ అసిస్ట్, సర్కిల్ టు సెర్చ్ వంటి ఫీచర్లు వీటిలో అందుబాటులో ఉంటాయి.

వివో V50e స్మార్ట్‌ఫోన్‌లో అనేక ఫీచర్లు వెల్లడయ్యాయి. లీక్స్ ప్రకారం.. ఈ వివో ఫోన్‌లో 1.5K 120Hz అమోలెడ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్‌సెట్, 90W ఛార్జింగ్‌తో 5600mAh బ్యాటరీ ఉండే అవకాశం ఉంది. ఈ ఫోన్ ధర రూ. 25 వేల నుండి రూ. 30 వేల వరకు ఉంటుందని అంచనాలు చెబుతున్నాయి.