Realme GT 7: గేమర్స్ మొబైల్.. రియల్‌మీ నుంచి పవర్‌ఫుల్ స్మార్ట్‌ఫోన్.. 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్..!

Realme GT 7: రియల్‌మీ భారతదేశంలో కొత్త శక్తివంతమైన ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీని పేరు Realme GT 7, ఇది మే 27, 2025న లాంచ్ అవుతుంది. దీనిలో 7,000mAh బ్యాటరీ, 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌కి సపోర్ట్ అందిస్తుంది. దీనితో ఇది కేవలం 15 నిమిషాల్లో 50శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. ఇది అధిక పనితీరు, గేమింగ్‌కు సరైనది. ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల 144Hz ఓఎల్ఈడీ డిస్‌ప్లే, జీటీ బూస్ట్ మోడ్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇప్పటివరకు వెల్లడైన ఈ కొత్త ఫోన్ గురించి వివరంగా తెలుసుకుందాం.
Realme GT 7 Features
కంపెనీ రాబోయే Realme GT 7 ఫోన్ ప్రాసెసర్‌ను ధృవీకరించింది. ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 9400e చిప్‌సెట్‌పై నడుస్తుందని తెలిపింది. ఈ చిప్‌సెట్ X4 ప్రైమ్ కోర్‌ను ఉపయోగిస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC వలె అదే ప్రాసెస్ నోడ్‌పై నిర్మించారు. ఈ ఫోన్ AnTuTu స్కోరులో 2.45 మిలియన్ పాయింట్లకు పైగా స్కోర్ చేసిందని పేర్కొన్నారు.
జీటీ 7 హ్యాండ్‌సెట్ సపోర్ట్ ఉన్న GT బూస్ట్ మోడ్‌కు సపోర్ట్ ఇస్తుందని, ఆరు గంటల వరకు స్థిరమైన 120FPS BGMI గేమ్‌ప్లేను అందిస్తుందని రియల్‌మీ పేర్కొంది. ఈ ఫోన్ “మిల్లీసెకండ్-స్థాయి పనితీరు కేటాయింపు ఖచ్చితత్వం”తో ఉంటుందని, “తక్కువ విద్యుత్ వినియోగం,మెరుగైన థర్మల్ నిర్వహణతో అల్ట్రా-స్మూత్ గేమ్‌ప్లేను” నిర్ధారిస్తుందని వెెల్లడించింది. రియల్‌మీ GT 7 అధికారిక లైవ్ పేజీ ప్రకారం, ఫోన్‌లోని డిస్‌ప్లే 6,000 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్ చేస్తుంది.
రియల్‌మీ జీటీ 7 7,000 ఎంఏహెచ్ బ్యాటరీని 10 శాతం సిలికాన్ యానోడ్‌తో ప్యాక్ చేస్తుంది, ఇది 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కేవలం 15 నిమిషాల్లోనే హ్యాండ్‌సెట్‌ను 1 నుండి 50 శాతం వరకు ఛార్జ్ చేయగలదని పేర్కొన్నారు. ఇది 7.5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌లో బ్యాటరీ-సెంట్రలైజ్డ్ చిప్ ఉంటుంది, ఇది 95 శాతం వరకు తక్కువ వేడెక్కడం,మూడు రెట్లు ఎక్కువ బ్యాటరీ జీవితాన్ని నిర్ధారిస్తుంది. రియల్‌మీ GT 7 ఐస్సెన్స్ బ్లాక్,ఐస్సెన్స్ బ్లూ రంగులలో వస్తుంది. ఇది థర్మల్ మెనేజ్‌మెంట్ కోసం ఐస్‌సెన్స్ గ్రాఫేన్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. దీనితో పాటు వచ్చే రియల్‌మీ GT 7T వేరియంట్ బ్లాక్, బ్లూ, ఎల్లో కలర్స్‌లో అందుబాటులో ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
- OnePlus Nord 5-Nord CE 5: అతిపెద్ద న్యూస్.. వన్‌ప్లస్ నుంచి రెండు కొత్త ఫోన్లు.. పెద్ద బ్యాటరీ.. అదిరే ఫీచర్లు..!