Xiaomi Civi 5 Pro: నిజం కాబోతుంది.. విడుదలకు సిద్ధమవుతున్న షియోమి కొత్త ఫోన్.. ఫీచర్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే..!

Xiaomi Civi 5 Pro: షియోమి ప్రీమియం స్మార్ట్‌ఫోన్ Xiaomi Civi 5 Pro ఈ నెలాఖరు నాటికి లాంచ్ అవుతుందని కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ ప్రకటన కంపెనీ అధికారిక మార్గాల ద్వారా వెలువడింది. దీనితో పాటు, ఫోన్‌కు సంబంధించిన అనేక ముఖ్యమైన సమాచారం కూడా షేర్ చేశారరు. అదే సమయంలో, కంపెనీ ఇంకా ఖచ్చితమైన లాంచ్ తేదీని వెల్లడించలేదు, కానీ అది మే 22 న విడుదల అవుతుందని భావిస్తున్నారు. రండి.. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Xiaomi Civi 5 Pro Colour Options
షియోమి అధ్యక్షుడు,స్మార్ట్‌ఫోన్ విభాగం అధిపతిలు వీబింగ్ ప్రకారం, సివి సిరీస్ ఇప్పుడు ట్రెండీ ఫ్లాగ్‌షిప్ కంటే ఎక్కువగా ఆల్ రౌండ్ సన్నని, తేలికైన ఫ్లాగ్‌షిప్‌గా మారుతోంది. Xiaomi Civi 5 Pro కి “లిటిల్ 15” అనే ఇంటర్నల్ కోడ్‌నేమ్ ఉంది. ఇది ఐఫోన్ లాంటి ప్రీమియం అనుభవాన్ని అందించే విధంగా రూపొందించారు. ఈ ఫోన్ పర్పుల్, లైట్ బ్రౌన్, వైట్, బ్లాక్ వంటి అనేక ఆకర్షణీయమైన రంగులలో తీసుకురానున్నారు.
Xiaomi Civi 5 Pro Camera Features
షియోమి సివి 5 ప్రో రౌండ్ కెమెరా మాడ్యూల్‌లో లైకా ప్యూర్ ఆప్టిక్స్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. లీకైన నివేదికల ప్రకారం, ఇది f/1.63 ఎపర్చరుతో మెయిన్ కెమెరా, 15మి.మీ ఫోకల్ లెంగ్త్‌తో f/2.2 అల్ట్రా-వైడ్ లెన్స్, 50మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా (60mm ఫోకల్ లెంగ్త్) కలిగి ఉంటుంది. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ముందు భాగంలో 50మెగాపిక్సెల్ కెమెరా ఉంటుందని అధికారికంగా ధృవీకరించింది.
Xiaomi Civi 5 Pro Specifications
ఇటీవల ఈ ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించింది, అక్కడ అది స్నాప్‌డ్రాగన్ 8s జెన్ 4 చిప్, 16జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 15తో కనిపించింది. 3C సర్టిఫికేషన్ 67W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని వెల్లడించింది. నివేదికల ప్రకారం, ఫోన్ 1.5K రిజల్యూషన్‌తో 6.55-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ ఓఎల్ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని చెబుతున్నారు. బ్యాటరీ విషయానికొస్తే, ఈ రాబోయే ఫోన్ 6000mAh కంటే ఎక్కువ బ్యాటరీతో రావచ్చు. భారతదేశంలో షియోమి 5 ప్రోని షియోమి 15 సివిగా రీబ్రాండ్ చేయవచ్చనే ఊహాగానాలు కూడా ఉన్నాయి. చైనాలో దీని ధర 3,000 యువాన్ల వరకు ఉంటుంది, అంటే దాదాపు రూ. 34,500.
ఇవి కూడా చదవండి:
- Samsung Galaxy S25 FE: ఫ్యాన్స్ స్పెషల్.. సామ్సంగ్ నుంచి సరికొత్త ఫోన్.. అప్గ్రేడ్లు చూస్తే అవాక్కే..!