Realme 14 5G: షాకింగ్ ఫీచర్స్.. రియల్‌మీ కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర ఎంతంటే..?

Realme 14 5G: టెక్ బ్రాండ్ రియల్‌మీ తన తాజా స్మార్ట్‌ఫోన్ Realme 14 5Gని భారత్‌లో విడుదల చేసింది. ఎంపిక చేసిన గ్లోబల్ మార్కెట్‌లలో కూడా అందుబాటులోకి వచ్చింది. మొబైల్ మార్కెట్ అంచనా వేసినట్లుగా చైనాలో విడుదల చేసిన Realme Neo 7x మాదిరిగానే ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 12 జీబీ ర్యామ్‌తో స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 చిప్‌సెట్ ఉంది. 45వాట్స్ సూపర్‌వూక్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్, లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో 6,000mAh బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. Realme 14 5G స్మార్ట్‌ఫోన్ ఫీచర్స్, ధర తదితర వివరాలు తెలుసుకుందాం.
Realme 14 5G Specifications
కొత్త Realme 14 5G స్మార్ట్‌ఫోన్‌లో 6.67-అంగుళాల ఫుల్ హెచ్‌డీ ప్లస్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంది. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్, 2,000నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కి సపోర్ట్ ఇస్తుంది. స్నాప్‌డ్రాగన్ 6 జెన్ 4 SoC ప్రాసెసర్‌తో 12జీబీ ర్యామ్, 51జీబీ వరకు ఆన్‌బోర్డ్ స్టోరేజ్ ఉంది. స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 అవుట్-ఆఫ్-ది-బాక్స్ పైన Realme UI 6పై రన్ అవుతుంది.
కెమెరా విభాగంలో Realme 14 5G స్మార్ట్‌ఫోన్ f/1.8 ఎపర్చరు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో AI- సపోర్ట్ గల 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌ను ప్యాక్ చేస్తుంది. సెకండరీ సెన్సార్, వెనుక భాగంలో LED ఫ్లాష్ యూనిట్‌ను ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, f/2.4 ఎపర్చర్‌తో 16-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా అందించారు.
Realme 14 5G స్మార్ట్‌ఫోన్ థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. ఇది మృదువైన గేమ్‌ప్లే కోసం 120fps వరకు సపోర్ట్ ఇస్తుంది. మొత్తం గేమింగ్ అనుభవాన్ని మెరుగుపరచడానికి GT బూస్ట్ మోడ్ ఉంటుంది. కంపెనీ ప్రకారం.. స్మార్ట్‌ఫోన్ 6,000mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది, ఇది 45W సూపర్‌వూక్ ఛార్జింగ్, బైపాస్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ ఇస్తుంది. హ్యాండ్‌సెట్ IP66, IP68, IP69 డస్ట్, వాటర్ ప్రొటెక్టెడ్‌గా ఉంటుంది.
Realme 14 5G Price
Realme 14 5G స్మార్ట్‌ఫోన్ 12GB + 256GB వేరియంట్‌కు THB 13,999 (దాదాపు రూ. 35,300) నుండి ప్రారంభమవుతుంది, అయితే 12GB + 512GB మోడల్ ధర THB 15,999 (దాదాపు రూ. 40,40). సిల్వర్, స్టార్మ్ టైటానియం, వారియర్ పింక్ కలర్స్‌లో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంటుంది. ఈ Realme 14 5G స్మార్ట్‌ఫోన్ భారతదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే దానిపై ఇంకా అధికారిక సమాచారం లేదు. Realme 14 Pro+, Realme 14 Pro ఇప్పటికే దేశంలో అందుబాటులో ఉన్నాయి. Realme 14 5G స్మార్ట్‌ఫోన్ త్వరలో ఈ ర్యాంక్‌లలో చేరుతుందని భావిస్తున్నారు.