Vivo V50e: ఈ ఫోన్ ఉంటే చాలు, వేరే కెమెరా అక్కర్లేదు.. లాంచ్ ఎప్పుడో తెలుసా..?

Vivo V50e: చైనీస్ మొబైల్ దిగ్గజం Vivo తన రాబోయే బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ Vivo V50eని త్వరలో భారతదేశంలో విడుదల చేయనుంది. ఈ Vivo V50e స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే BIS సర్టిఫికేషన్ సైట్‌లో లిస్ట్ అయింది. తాజా రెండర్‌లు దాని పూర్తి డిజైన్‌ను ఆవిష్కరించాయి. అదే సమయంలో మరో తీపి వార్త అందింది. తాజా సమాచారం ప్రకారం, రాబోయే Vivo V50e స్మార్ట్‌ఫోన్ OIS సపోర్ట్‌తో భారతీయుల కోసం ప్రత్యేకమైన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అయితే ఈ ప్రత్యేక ఫీచర్ ఏమిటి? రాబోయే Vivo V50e స్మార్ట్‌ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉండవచ్చో చూద్దాం.
టెక్ మార్కెట్ లేటెస్ట్ అప్‌డేట్ ప్రకారం. రాబోయే బడ్జెట్-బడ్జెట్ ఫ్రెండ్లీ Vivo V50e స్మార్ట్‌ఫోన్ OIS మద్దతుతో 50MP Sony IMX882 సెన్సార్‌ను కలిగి ఉంటుంది. ప్రత్యేకమైన వెడ్డింగ్ పోర్ట్రెయిట్ స్టూడియో ఫీచర్ కూడా ఉంది. వినియోగదారులు 1x, 1.5x , 2x ఫోకల్ లెంగ్త్‌లతో సోనీ మల్టీఫోకల్ పోర్ట్రెయిట్ చిత్రాలను క్యాప్చర్ చేయగలరు కాబట్టి ఈ ఫీచర్ ఫోటోగ్రఫీ ప్రియులకు ఆకర్షణీయమైన ఎంపికగా ఉంటుంది. దీని వల్ల కస్టమర్ల ఫోటోగ్రఫీ అనుభవం మెరుగుపడుతుందని అంటున్నారు. ఫోన్ బడ్జెట్ ధర ఉన్నప్పటికీ, Vivo V50e, Vivo V50 5Gకి సమానమైన కెమెరా అనుభవాన్ని అందిస్తుందని భావిస్తున్నారు.
Vivo V50e Features
తాజా రెండర్‌ల ప్రకారం, కొత్త Vivo V50e స్మార్ట్‌ఫోన్ డిజైన్ ఇటీవల విడుదల చేసిన Vivo V50 స్మార్ట్‌ఫోన్‌తో పోల్చవచ్చు. కొత్త Vivo V50e స్మార్ట్‌ఫోన్ 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.77-అంగుళాల క్వాడ్-కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. స్మార్ట్‌ఫోన్‌లో డైమెన్సిటీ 7300 ప్రాసెసర్‌తో పాటు 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ అందించారు.
కెమెరా విభాగంలో Vivo V50e స్మార్ట్‌ఫోన్ OIS మద్దతుతో 50MP సోనీ IMX882 సెన్సార్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ప్రైమరీ కెమెరాతో పాటు 8MP అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీల కోసం, స్మార్ట్‌ఫోన్ ముందు భాగంలో 50MP సెల్ఫీ కెమెరా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ 90W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో పెద్ద 5,600 mAh బ్యాటరీని కలిగి ఉండవచ్చని అనేక నివేదికలు చెబుతున్నాయి.
అదనంగా Vivo V50e స్మార్ట్‌ఫోన్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68+IP69 రేటింగ్‌తో వస్తుంది. సఫైర్ బ్లూ, పెరల్ వైట్ అనే రెండు రంగుల ఆప్షన్స్‌లో స్మార్ట్‌ఫోన్‌ను ఎంచుకోవచ్చు. బడ్జెట్-ఫ్రెండ్లీ ధరలో కొత్త Vivo V50e స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ మధ్యలో రూ. 25,000 వద్ద అందుబాటులో ఉంటుంది. ఇదే ధరతోదేశంలో విడుదలయ్యే అవకాశం ఉంది, అయితే ఖచ్చితమైన తేదీని ఇంకా ప్రకటించలేదు.