Amazon Great Summer Sale 2025: భారీ డిస్కౌంట్స్.. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ వచ్చేస్తోంది.. బెస్ట్ డీల్స్ ఇవే..!

Amazon Great Summer Sale 2025: అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 గురువారం అర్ధరాత్రి (IST మధ్యాహ్నం 12 గంటలకు) అమెజాన్ ప్రైమ్ మెంబర్ల కోసం ప్రారంభమవుతుంది. ఈ డీల్స్, డిస్కౌంట్లు మధ్యాహ్నం 12 గంటల నుండి అందరు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. ఈ డిస్కౌంట్ సేల్‌లో ఎలక్ట్రానిక్స్, ఫ్యాషన్, గృహాలంకరణ, వంటగదికి అవసరమైన వస్తువులు వంటి వివిధ ఉత్పత్తులపై 80 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. క్రెడిట్ కార్డ్, EMI లావాదేవీలపై అదనపు తక్షణ డిస్కౌంట్లను అందించడానికి అమెజాన్ HDFC బ్యాంక్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ఇది కాకుండా, ఆసక్తిగల కొనుగోలుదారులు కూపన్ ఆధారిత తగ్గింపులను కూడా పొందగలరు.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 ఎప్పుడు..?
అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న దుకాణదారులు మే 1 అర్ధరాత్రి (భారతీయ కాలమానం ప్రకారం ఉదయం 12 గంటలకు) నుండి గ్రేట్ సమ్మర్ సేల్ 2025ని యాక్సెస్ చేయగలరు. మీకు ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ లేకుంటే లేకపోతే, అందిరికి అందుబాటులో వచ్చే వరకు12 గంటలు వేచి ఉండాలి. సేల్ ముగింపు తేదీని వెల్లడించలేదు, కానీ ఇది కొన్ని రోజులు మాత్రమే ఉంటుందని భావిస్తున్నారు. అయితే, మీరు ఏమి కొనాలనుకుంటున్నారో మీకు తెలిసి, ధరలు తక్కువగా ఉంటే, స్టాక్ అయిపోకముందే కొనుగోలు చేయడం మంచిది.
అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ ముందే యాక్సెస్ ఎలా పొందాలి..?
దీని కోసం మీరు అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కలిగి ఉండాలి. భారతదేశంలో, అమెజాన్ ప్రైమ్ నెలవారీ ధర రూ. 299, మూడు నెలల ధర రూ. 599. అదే సమయంలో, వార్షిక సబ్‌స్క్రిప్షన్ ధర రూ. 1,499. కొత్త వినియోగదారులకు 30 రోజుల ఉచిత ట్రయల్ కూడా ఉంది.
కస్టమర్లు రూ.799కి ఒక సంవత్సరం కాలపరిమితి గల ప్రైమ్ లైట్ ప్లాన్ లేదా రూ.399కి ఒక సంవత్సరం కాలపరిమితి గల ప్రైమ్ షాపింగ్ ఎడిషన్ ప్లాన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఉచిత షిప్పింగ్‌తో పాటు, ప్రైమ్ మెంబర్స్, ప్రైమ్ వీడియో, ప్రైమ్ మ్యూజిక్‌కు కూడా యాక్సెస్ పొందుతారు.
అమెజాన్ డీల్స్, ఆఫర్లు
ఈ-కామర్స్ వెబ్‌సైట్ ప్రత్యేక మైక్రోసైట్ ద్వారా ఆఫర్‌లను టీజ్ చేయడం ప్రారంభించింది. అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2025 స్మార్ట్‌ఫోన్‌లు, టూల్స్‌పై 40 శాతం వరకు తగ్గింపు, టాబ్లెట్‌లపై 60 శాతం వరకు తగ్గింపును అందిస్తుందని చెబుతున్నారు. ఇది కాకుండా, గృహోపకరణాలు, స్మార్ట్ టీవీలు, ప్రొజెక్టర్లపై 65 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది. ప్రయాణ బుకింగ్‌లపై కస్టమర్లకు 40 శాతం వరకు తగ్గింపు లభిస్తుంది.
యాపిల్, ఐకూ, వన్‌ప్లస్, సామ్‌సంగ్, రియల్‌మి, షియోమి నుండి మొబైల్ ఫోన్లు తక్కువ ధరలకు లభిస్తాయి. సామ్‌సంగ్ గెలాక్సీ S24 అల్ట్రా, ఐఫోన్ 15, వన్‌ప్లస్ 13R వంటి హ్యాండ్‌సెట్‌లు ఇప్పటికే డిస్కౌంట్లతో జాబితా చేశారు. ఈ సేల్ సమయంలో గెలాక్సీ A 55 5G, గెలాక్సీ M35 5G కూడా తగ్గింపు ధరలకు లభిస్తాయి.
ఈ సేల్ సమయంలో 43-అంగుళాల షియోమి స్మార్ట్ టీవీ A Pro, 55-అంగుళాల సోని బ్రావియా 3 సిరీస్ 4K అల్ట్రా HD టీవీలను తక్కువ ధరకు కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఈ సేల్‌లో అమెజాన్ పరికరాలపై కూడా ఆఫర్‌లు ఉంటాయి.హెచ్‌డిఎఫ్‌సి కార్డులు, EMI లావాదేవీల ద్వారా చేసే కొనుగోళ్లపై అమెజాన్ 10 శాతం తక్షణ తగ్గింపును కూడా అందిస్తోంది. కొనుగోలుదారులు Amazon Pay ICICI క్రెడిట్ కార్డ్ కొనుగోళ్లపై నో-కాస్ట్ EMI ఆఫర్‌లను కూడా పొందగలరు. ఇది కాకుండా, కస్టమర్లకు ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, కూపన్ డిస్కౌంట్లు కూడా లభిస్తాయి.