Best 5G Smartphones Launching In May 2025: ఫోన్ కొనాలి అనుకుంటున్నారా.. ఒకటికి మించి మరొకటి.. పోటాపోటీ ఫీచర్లతో లాంఛ్‌కు రెడీగా కిర్రాక్ స్మార్ట్ఫోన్లు..!

Best 5G Smartphones Launching In May 2025: కొత్త 5G స్మార్ట్‌ఫోన్ కొనాలని చూస్తున్నారా? అయితే మీకు శుభవార్త. ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకూ అభివృద్ధి చెందుతోంది. ఇంట్లో కూర్చొని మీ మొబైల్ ఫోన్ నుండి మీరు చాలా పనులు చేయవచ్చు. ఈ నెలలో భారతదేశంలో అనేక శక్తివంతమైన ఫోన్లు లాంచ్ కానున్నాయి. మీరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. ప్రతి బడ్జెట్ కేటగిరీలోనూ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. వాటి ధరలు తక్కువ బడ్జెట్ నుంచి హై రేంజ్ వరకు ఉంటాయి.
Realme C75 5G
ఈ రోజు నుండి మే నెల ప్రారంభమైంది. మీరు కొత్త ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే మీకు మంచి అవకాశం వస్తోంది. బడ్జెట్ ప్రకారం Realme C75 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఈ చౌకైన 5G ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు ప్రత్యేకంగా వెల్లడయ్యాయి. 6000mAh బ్యాటరీతో కూడిన దీని ధర రూ. 12999 నుండి ప్రారంభమవుతుంది. దీనిలో 4GB RAM అందుబాటులో ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ స్క్రీన్, IP64 రేటింగ్, 12GB వర్చువల్ RAM కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ రెండు ర్యామ్ వేరియంట్లో వస్తుంది.
Samsung Galaxy S25 Edge
సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎడ్జ్ మే 13న ప్రపంచవ్యాప్తంగా లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ కంపెనీ గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో వచ్చే అవకాశం ఉంది. ఈ గెలాక్సీ ఎస్25 ఎడ్జ్ స్మార్ట్‌ఫోన్ భారత మార్కెట్‌లోకి కూడా ప్రవేశించవచ్చు. ఇది ప్రీమియం లుక్ కలిగిన ఫ్లాగ్‌షిప్ ఫోన్ అవుతుంది. దీనిని క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌లో తీసుకురావచ్చు. ఈ ఫోన్‌లో 200MP కెమెరా వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో, ఈ సామ్‌సంగ్ 5G ఫోన్‌కు 3900mAh బ్యాటరీ, 6.7 అంగుళాల FHD + sAMOLED డిస్‌ప్లే ఇవ్వచ్చు. ఈ S25 ఎడ్జ్ గెలాక్సీ ‘S’ సిరీస్‌లో నాల్గవ మోడల్ అవుతుంది. దీని ధర గురించి మాట్లాడుకుంటే, ఇది రూ. 99999 (1 లక్ష) కు లభిస్తుంది.
OnePlus 13s
వన్‌ప్లస్ 13ఎస్ మే నెలలో లాంచ్ కానున్న అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న మొబైల్‌లలో ఒకటి. ఇది కంపెనీ నంబర్ 13 సిరీస్‌లో భారతదేశంలో లాంచ్ కానున్న మూడవ ఫోన్ అవుతుంది. దీని ధర గురించి మాట్లాడుకుంటే, ఇది రూ. 56999 కు లభించే అవకాశం ఉంది. ఈ వన్‌ప్లస్ ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో లాంచ్ అవుతుంది. ఇందులో 6.32-అంగుళాల కాంపాక్ట్ డిస్‌ప్లే ఉంటుంది. దీనితో పాటు, 6260mAh బ్యాటరీతో పాటు 80W వైర్డు,50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌ను అందించచ్చు. ఫోటోగ్రఫీ కోసం, ఇందులో 50 OIS వెనుక కెమెరా, 32MP ముందు కెమెరా ఉంటుంది.
Motorola Razr 60
మోటరోలా రేజర్ 60 5G స్మార్ట్‌ఫోన్ మే నెలలో లాంచ్ కానుంది. ఈ ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే 6.96-అంగుళాల ఫ్లెక్స్‌వ్యూ మెయిన్ స్క్రీన్, 3.63-అంగుళాల సెకండరీ స్క్రీన్ ఉంటాయి. రెండు డిస్‌ప్లేలు pOLED ప్యానెల్‌లను ఉపయోగిస్తాయి. గొరిల్లా గ్లాస్ విక్టస్‌తో ప్రొటక్షన్ ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 7400X ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. అలానే 50MP డ్యూయల్ రియర్ కెమెరా, 32MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. పవర్ బ్యాకప్ కోసం స్మార్ట్‌ఫోన్ 30W టర్బోపవర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో 4500mAh బ్యాటరీకి సపోర్ట్ ఇస్తుంది. ఇది మార్కెట్లో రూ. 67999 ప్రారంభ ధరతో అందుబాటులో ఉంటుంది.
POCO F7 5G
ఈ స్మార్ట్‌ఫోన్ మే నెలలో లాంచ్ అవుతుంది. ఇది 7550mAh అతిపెద్ద బ్యాటరీతో వస్తుందని భావిస్తున్నారు. దీని ధర గురించి చెప్పాలంటే, రూ. 36999 కు అందుబాటులో ఉంటుంది. దీనికి 12GB RAM తో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 చిప్‌సెట్ ఇవ్వచ్చు. ఈ పోకో ఫోన్ 6.83-అంగుళాల 1.5K OLED డిస్ప్లేతో మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశం ఉంది. కెమెరా గురించి మాట్లాడుకుంటే 20MP ఫ్రంట్ కెమెరా,50MP OIS LYT600 డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉండచ్చు.