Samsung Galaxy S25 Edge: పేపర్ లాంటి ఫోన్.. Samsung Galaxy S25 Edge.. మీరు రెడీనా..!

Samsung Galaxy S25 Edge: సామ్‌సంగ్ Galaxy S25 Edge కొత్త లాంచ్ తేదీ వెల్లడైంది. ఈ సంవత్సరం ప్రారంభంలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో దక్షిణ కొరియా కంపెనీ ఈ ఫోన్‌ను టీజ్ చేసింది. ఈ నెలలో ఈ సామ్‌సంగ్ ఫోన్ లాంచ్ అయ్యే అవకాశం ఉంది. నివేదికల ప్రకారం, ఇది ప్రపంచంలోనే అత్యంత సన్నని ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ సందర్భంగా సామ్‌సంగ్ ఈ ఫోన్ ప్రదర్శించింది. దీని కెమెరాతో సహా అనేక ఫీచర్లు Galaxy S25 Ultra లాగా ఉంటాయి.
ఈ సామ్‌సంగ్ ఫోన్‌ను ఈ నెల 13వ తేదీన లాంచ్ చేయచ్చు. ఈ ఫోన్ లాంచ్ తేదీని ఇవాన్ బ్లాస్ తన X హ్యాండిల్ నుండి పంచుకున్నారు. పోస్ట్ ప్రకారం.. ఈ సామ్‌సంగ్ ఫోన్ లాంచ్ డేట్ పోస్టర్‌లో “బియాండ్ స్లిమ్” అని ప్రస్తావించింది. అంటే ఇది అల్ట్రా-సన్నని ఫోన్ అని సూచిస్తుంది. ఈ సామ్‌సంగ్ ఫోన్ మొదట చైనా, దక్షిణ కొరియాలో అమ్మకానికి అందుబాటులోకి వస్తుంది. ఇది మే 23న అమ్మకానికి వస్తుంది. అదే సమయంలో ఈ ఫోన్‌ను మే 30న భారతదేశం, అమెరికా, ఇతర దేశాలలో లాంచ్ చేయవచ్చు.
సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌లో 200MP మెయిన్ కెమెరా ఉంటుంది. దీనితో 12MP అల్ట్రా వైడ్ కెమెరా అందుబాటులో ఉంటుంది. అదే సమయంలో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం ఈ ఫోన్‌లో 12MP కెమెరా ఉంటుంది, ఇది OIS కి సపోర్ట్ ఇస్తుంది అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్. ఈ ఫోన్ వెనుక భాగంలో డ్యూయల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. ఫోన్ కెమెరాలు నిలువుగా ఉంటాయి. దానితో పాటు LED ఫ్లాష్ కూడా అందుబాటులో ఉంటుంది.
Samsung Galaxy S25 Edge Features
సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ టైటానియం సిల్వర్, టైటానియం జెట్ బ్లాక్ అనే రెండు రంగు ఎంపికలలో లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, దీనికి 6.6-అంగుళాల OLED డిస్‌ప్లే ఉంటుంది. ఈ సిరీస్‌లోని ఇతర మోడళ్ల మాదిరిగానే, ఈ స్మార్ట్‌ఫోన్ కూడా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో రావచ్చు.
సామ్‌సంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్‌లో 12జీబీ ర్యామ్, 512జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ ఉంటుంది. ఈ సన్నని సామ్‌సంగ్ ఫోన్ మందం 5.8 మి.మీ మాత్రమే ఉంటుంది. ఇందులో శక్తివంతమైన 3,900mAh బ్యాటరీ ఉంటుంది. ఇది 25W ఫాస్ట్ వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 7 ఆధారంగా OneUI 15 పై పనిచేస్తుంది.
ఇవి కూడా చదవండి:
- Amazon Prime Day Sale 2025: అమెజాన్ అతిపెద్ద సేల్.. భారీ డిస్కౌంట్లతో పండగే పండగ.. డేట్ వచ్చేసింది..!