Last Updated:

OnePlus 13T: వారెవ్వా.. తగ్గేదేలే.. ఐఫోన్ 16 రేంజ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 13T వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?

OnePlus 13T: వారెవ్వా.. తగ్గేదేలే.. ఐఫోన్ 16 రేంజ్ ఫీచర్లతో వన్‌ప్లస్ 13T వచ్చేస్తోంది.. ధర ఎంతంటే..?

OnePlus 13T: వన్‌ప్లస్ మరో కొత్త మొబైల్‌ను విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ ఇప్పటికే OnePlus 13, OnePlus 13R ఫోన్‌లను పరిచయం చేసింది. ఇప్పుడు, OnePlus 13T మార్కెట్లోకి వస్తోంది. గత కొన్ని రోజులుగా ఈ మొబైల్‌కు సంబంధించిన వివరాలు బయటకు వస్తున్నాయి. అయితే, ఇప్పుడు కంపెనీ అధికారికంగా ఫోన్ లాంచ్‌ను ప్రకటించింది. వన్‌ప్లస్ తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలో 13T ఫోన్ బాక్స్ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోన్ లాంచ్ డేట్, ఫీచర్స్, స్పెసిఫికేషన్లు తదితర వివరాలు తెలుసుకుందాం.

 

OnePlus 13T Launch Date
వన్‌ప్లస్ తన కొత్త OnePlus 13T ఫోన్‌ను ఈ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. స్మార్ట్‌ఫోన్ ఖచ్చితమైన లాంచ్ తేదీ ప్రస్తుతం వెల్లడి కాలేదు. ఈ OnePlus 13T మొబైల్ కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్. ఇది ప్రీమియం డిజైన్‌లో తీసుకొస్తున్నారు. ‘స్మాల్ స్క్రీన్ పవర్‌హౌస్’ అనే ట్యాగ్‌లైన్‌తో కంపెనీ ప్రచారం చేస్తోంది. ముఖ్యంగా, ఈ ఫోన్ డిజైన్ iPhone 16eని పోలి ఉండే అవకాశం ఉంది.

 

OnePlus 13T Price
వన్‌ప్లస్ 13T మొబైల్ ఇటీవల ప్రారంభించిన Realme GT 7 ప్రో రేసింగ్ ఎడిషన్ కంటే తక్కువ ధరలో ఉంటుంది. దీని ధర దాదాపు రూ.37,000. OnePlus 10T మొబైల్ నుండి ప్రారంభమవుతుంది. ఆగస్టు 2022లో విడుదల చేశారు. ఇది చివరి వన్‌ప్లస్ ‘T’ మోడల్ ఫోన్. దీని ధర రూ.49,999గా ఉంది.

 

OnePlus 13T Features
వన్‌ప్లస్ 13T మొబైల్‌లో 6.31 అంగుళాల డిస్‌ప్లే ఉంటుంది. 1.5K రిజల్యూషన్ సపోర్ట్‌తో LTPO OLED ప్రీమియం స్క్రీన్. ఈ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో వస్తుంది. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ టెక్నాలజీని కూడా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో విడుదల కానుంది. వన్‌ప్లస్ 13 ఫోన్‌లో అదే ప్రాసెసర్ ఉంది.

 

ఈ ప్రాసెసర్‌తో ఇది ప్రపంచంలోనే అత్యంత సరసమైన స్మార్ట్‌ఫోన్ అవుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్‌లతో లాంచ్ కానుంది. వన్‌ప్లస్ 13T మొబైల్‌లో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ OIS మద్దతుతో 50-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంది. రెండవ కెమెరాలో 2x జూమ్‌తో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్‌ ఉన్నాయి.

 

సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంటుంది. ప్రస్తుతం వన్‌ప్లస్ 13 సిరీస్‌లోని వృత్తాకార కెమెరా మాడ్యూల్‌కు భిన్నంగా ఉంది. అంటే, ఇది బార్ ఆకారపు డ్యూయల్ కెమెరా డిజైన్‌ ఉండచ్చు. ఫోన్ 6200mAh బ్యాటరీతో ప్యాక్ చేయబడుతుందని భావిస్తున్నారు. కంపెనీ వన్‌ప్లస్ 13 మొబైల్‌ను 6000mAh కెపాసిటీ బ్యాటరీతో విడుదల చేసింది. ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి, 80W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, 50W వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అందించారు.