iQOO Z10 Launch: వార్నీ.. భలే ఉందిగా ఫోన్.. 7300mAh భారీ బ్యాటరీతో ఐక్యూ 5G ఫోన్ వస్తోంది..!

iQOO Z10 Launch: టెక్ కంపెనీ ఐక్యూ 7300mAh బ్యాటరీతో మొదటి స్మార్ట్‌ఫోన్‌ని 11 ఏప్రిల్ 2025న అధికారికంగా విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. కంపెనీ తన మీడియా హ్యాండిల్స్ ద్వారా శుక్రవారం కొత్త Z సిరీస్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీని ప్రకటించింది. కంపెనీ ఐక్యూ రాబోయే స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా వెల్లడించింది. కంపెనీ ఇండియా CEO నిపున్ మారియా తమ ట్విట్టర్ హ్యాండిల్స్ ద్వారా కొత్త ఫోన్ లాంచ్ తేదీని వెల్లడించారు.
iQOO 10R డ్యూయల్ సెన్సార్లు , OIS సపోర్ట్‌తో వృత్తాకార కెమెరా మాడ్యూల్‌తో వస్తుంది. వచ్చే నెలలో కంపెనీ చైనాలో iQOO Z10 Turbo స్మార్ట్‌ఫోన్‌తో పాటు iQOO Z10ని లాంచ్ చేస్తుందని భావిస్తున్నారు. అసలు iQOO Z10 స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, 1.5K రిజల్యూషన్‌తో OLED డిస్‌ప్లేతో వచ్చే అవకాశం ఉంది. ఇది ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OriginOS 5లో రన్ అవుతుంది.
లీక్‌ల ప్రకారం, iQOO Z10 5G అద్భుతమైన డిస్‌ప్లే నాణ్యత కోసం 1.5K రిజల్యూషన్‌తో 6.78-అంగుళాల ఫ్లాట్ OLED LTPS డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది ఖచ్చితంగా మీడియా వినియోగ అనుభవాన్ని మెరుగుపరుస్తుంది. ఫోన్ డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. 50MP ప్రైమరీ సెన్సార్‌తో పాటు వెనుకవైపు 2MP సెకండరీ డెప్త్ సెన్సార్, అద్భుతమైన సెల్ఫీలు తీసుకోవడానికి 16MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంటుంది.
మల్టీ టాస్కింగ్ కోసం మీడియాటెక్ డైమెన్సిటీ 8400 లేదా స్నాప్‌డ్రాగన్ 7s జెన్ 3 ప్రాసెసర్ ఉంటుందని భావిస్తున్నారు. అలాగే ఈ చిప్ గేమర్స్‌కి చాలా బాగుంది. అంటే మీరు తాజా ఆండ్రాయిడ్ గేమ్‌లను సజావుగా ఆడచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో పెద్ద 7300 mAh బ్యాటరీ ఉంది, ఇది రోజంతా ఉండేలా తగినంత శక్తిని ఇస్తుంది. ఈ భారీ బ్యాటరీని 90W వైర్డు ఛార్జర్‌తో ఛార్జ్ చేయచ్చు.