Samsung Galaxy A26 5G Launch: ఆసమ్.. సామ్‌సంగ్ కొత్త ఫోన్.. రూ. 24,999లకే ఖతర్నాక్ ఫీచర్స్..!

Samsung Galaxy A26 5G Launch: సామ్‌సంగ్ గెలాక్సీ A26 5జీ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో లాంచ్ అయింది. సామ్‌సంగ్ నుంచి వచ్చిన ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ గత సంవత్సరం విడుదల చేసిన గెలాక్సీ A25 5జీకి అప్‌గ్రేడ్ వెర్షన్. ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్‌లో 5,000mAh శక్తివంతమైన బ్యాటరీతో సహా అనేక బలమైన ఫీచర్లు ఉంటాయి. ఇది కాకుండా, ఈ ఫోన్ IP67 రేట్ చేశారు. దీనికి ముందు కంపెనీ మార్కెట్లో సామ్‌సంగ్ గెలాక్సీ A56, గెలాక్సీ A36 5జీలను కూడా విడుదల చేసింది. ఈ రెండు సామ్‌సంగ్ ఫోన్‌లు కూడా IP67 రేటింగ్‌తో వస్తున్నాయి.
Samsung Galaxy A26 5G Price
సామ్‌సంగ్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను బ్లాక్, మింట్, వైట్, పీచ్ అనే నాలుగు కలర్ ఆప్షన్‌లలో విడుదల చేసింది. దక్షిణ కొరియా కంపెనీకి చెందిన ఈ ఫోన్ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది – 8GB RAM + 126GB, 8GB RAM + 256GB. దీని బేస్ వేరియంట్ ధర రూ. 24,999. టాప్ వేరియంట్ రూ. 27,999. ఫోన్ కొనుగోలుపై రూ.2,000 వరకు తక్షణ తగ్గింపును అందిస్తోంది.
Samsung Galaxy A26 5G Features
ఈ సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ 6.7 అంగుళాల FHD+ AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే రిజల్యూషన్ 1080 x 2340 పిక్సెల్‌లు, 120Hz అధిక రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ మిడ్ రేంజ్ బడ్జెట్ ఫోన్ వెనుక, ముందు ప్యానెల్‌లో సామ్‌సంగ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటక్షన్ అందించింది.
కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌లో Exynos 1380 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను అందించింది. ఈ ఫోన్‌లో 8జీబీ ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ ఉంది. మైక్రో SD కార్డ్ ద్వారా ఫోన్ స్టోరేజ్‌ని పెంచుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా OneUIలో పనిచేస్తుంది. వచ్చే 6 సంవత్సరాల పాటు ఈ ఫోన్‌తో సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను అందజేస్తామని కంపెనీ హామీ ఇచ్చింది, అంటే ఈ ఫోన్ వచ్చే 6 సంవత్సరాల వరకు కొత్తదిగా ఉంటుంది.
ఈ సామ్‌సంగ్ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. ఫోన్‌లో 50మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. అంతే కాకుండా ఫోన్ 8మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం13 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంటుంది.