Under 15K Mobiles: రూ.15 వేల బడ్జెట్.. వీటిని మించినవి లేవు.. లిస్ట్‌లో టాప్ ఇవే..!
Under 15K Mobiles: టెక్ మార్కెట్‌లో బడ్జెట్ సెగ్మెంట్ పరుగులు పెడుతుంది. అనేక ఫోన్లు వెల్లువలా వస్తూనే ఉన్నాయి. కొత్త మోడల్స్, వేరియంట్లు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మొబైల్ ప్రియులకు ఫోన్లు కొనడం చాలా కష్టమైన పనిగా మారింది. అయితే చాలా కంపెనీలు రూ.15 వేల లోపు కొత్త ఫోన్లను తీసుకొస్తునే ఉన్నాయి. అలానే ఈ ఫోన్లు అట్రాక్ట్ స్పెసిఫికేషన్లతో వస్తున్నాయి. దీంతో పాటు ఈ రేంజ్‌లోనే 5జీ స్మార్ట్‌ఫోన్‌లు కూడా ఉన్నాయి. ఈ సెగ్మెంట్‌లో iQOO, Oppo, Vivo, Poco వంటి బ్రాండ్లు ఉన్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
iQOO Z9
ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.72 అంగుళాల డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది క్వాల్‌కమ్ స్నాప్‌డ్రాగన్ 6 Gen ప్రాసెసర్‌ని కలిగి ఉంది. ఫోన్‌లో 50MP వెనుక కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీ కోసం 8MP సెన్సార్ అందుబాటులో ఉంది. పవర్ సపోర్ట్ కోసం 44W ఛార్జింగ్‌తో కూడిన 6000 mAh బ్యాటరీ అందించారు. దీని ధర రూ. 14,099 వేరియంట్- 6GB+128GB
Oppo K12x
ఒప్పో బడ్జెట్ ఫోన్ 6.67-అంగుళాల IPS LCD డిస్‌ప్లేతో 1000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఇందులో మెడిటెక్ 6300 ప్రాసెసర్ ఉంది. ఫోన్‌లో 32MP డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది, సెల్ఫీల కోసం 8MP కెమెరా అందుబాటులో ఉంది. ఇది 45W ఛార్జింగ్‌తో 5,100 mAh బ్యాటరీని కలిగి ఉంది. ధర రూ. 12,999 వేరియంట్- 6GB+128GB.
Vivo T3
ఇది 50MP మెయిన్ కెమెరా, 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది. ఇది 44W ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 6,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది. ధర రూ. 12,999వేరియంట్- 4GB + 128GB.
Poco X6 Neo
ఈ ఫోన్ అమెజాన్‌లో రూ. 12,999కి అందుబాటులో ఉంది. ఇది 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఈ ఫోన్‌లో మెడిటెక్ డైమన్‌సిటీ 6080 ప్రాసెసర్‌ని అమర్చారు. వెనుక ప్యానెల్‌లో 108MP మెయిన్ కెమెరా, సెల్ఫీల కోసం 16MP సెల్ఫీ కెమెరా ఉంది. ఫోన్ 33W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. ధర రూ. 12,999 వేరియంట్- 8GB + 128GB.
CMF Phone 1
CMF ఫోన్ 1 ధర కూడా రూ. 15,000 కంటే తక్కువ. ఇది 33W ఛార్జింగ్‌తో 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంది. సెల్ఫీ కోసం 16MP కెమెరా ఉంది, వెనుక ప్యానెల్‌లో 50MP సెన్సార్ ఉంది. ఇది 6.67 అంగుళాల పెద్ద డిస్‌ప్లేను కలిగి ఉంది