Last Updated:

Budget Mobile: బెస్ట్ బడ్జెట్ ఫోన్.. రూ. 8499కే 108 MP కెమెరా..!

Budget Mobile: బెస్ట్ బడ్జెట్ ఫోన్.. రూ. 8499కే 108 MP కెమెరా..!

Budget Mobile: మీరు రూ. 10,000 బడ్జెట్‌ లోపు ఉత్తమ ప్రైమరీ కెమెరాతో ఫోన్ కోసం చూస్తున్నట్లయితే.. itel S24 మీకు ఉత్తమ ఎంపిక. 108 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా కలిగిన ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్ ఇండియాలో కేవలం రూ. 8499కే అందుబాటులో ఉంది. మీరు ఈ ఫోన్‌లో మెమరీ ఫ్యూజన్ ఫీచర్‌తో 16 GB RAM వరకు పొందుతారు. కంపెనీ ఈ ఫోన్‌లో 90Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేను కూడా అందిస్తోంది. ఈ సెగ్మెంట్ ప్రకారం ఫోన్ ప్రాసెసర్ కూడా చాలా బాగుంది. కాబట్టి ఈ ఫోన్ గురించి వివరంగా తెలుసుకుందాం.

Itel S24 Features
కంపెనీ ఈ ఫోన్‌లో 1612×720 పిక్సెల్ రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల HD+ డిస్‌ప్లేను అందిస్తోంది. ఫోన్‌లో అందిస్తున్న ఈ డిస్‌ప్లే రిఫ్రెష్ రేట్ 90Hz. ఈ డిస్‌ప్లే 480 నిట్‌ల పీక్ బ్రైట్నెస్‌కు సపోర్ట్  ఇస్తుంది. ప్రత్యేక విషయం ఏమిటంటే మీరు డిస్‌ప్లేలో డైనమిక్ బార్‌ను కూడా చూడచ్చు. కంపెనీ ఫోన్‌లో 8 GB LPDDR4x RAMని అందిస్తోంది. మెమరీ ఫ్యూజన్ కారణంగా ఫోన్ మొత్తం RAM 16 GB కి పెరుగుతుంది. మీరు ఫోన్‌లో 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ పొందుతారు.

ప్రాసెసర్‌గా కంపెనీ ఈ ఫోన్‌లో MediaTek Helio G91 చిప్‌సెట్‌ను అందిస్తోంది. ఫోటోగ్రఫీ కోసం ఫోన్‌లో LED ఫ్లాష్‌తో రెండు కెమెరాలు ఉన్నాయి. ఇందులో 108-మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. మీరు ఫోన్‌లో సెల్ఫీ కోసం 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను చూడవచ్చు. ఫోన్‌ను పవర్ చేయడానికి, ఇది 5000mAh బ్యాటరీతో అందించారు. ఈ బ్యాటరీ 18 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

OS గురించి మాట్లాడితే ఫోన్ Android 13 ఆధారంగా itel OS 13.5లో పనిచేస్తుంది. బయోమెట్రిక్ భద్రత కోసం ఫోన్‌లో సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను చూడచ్చు. కనెక్టివిటీ కోసం కంపెనీ ఫోన్‌లో Dual 4G VoLTE, Wi-Fi 802.11 b/g/n, బ్లూటూత్ 5, GPS, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ వంటి ఎంపికలను అందిస్తోంది. ఫోన్ రెండు కలర్ ఆప్షన్స్‌లో వస్తుంది. అందులో డాన్ బ్లాక్, స్టార్రీ బ్లాక్ ఉన్నాయి.