Last Updated:

Smriti Mandhana: ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ( ఆర్సీబీ) మహిళా జట్టు కెప్టెన్‌గా భారత స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన ఎంపికైంది.

Smriti Mandhana: ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్‌గా స్మృతి మంధాన

Smriti Mandhana: రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ( ఆర్సీబీ) మహిళా జట్టు కెప్టెన్‌గా భారత స్టార్‌ క్రికెటర్‌ స్మృతి మంధాన ఎంపికైంది.

బీసీసీఐ చరిత్రలో తొలిసారి నిర్వహిస్తున్న మహిళా ప్రీమియర్‌ లీగ్‌ నేపథ్యంలో ఆర్సీబీ ఫ్రాంఛైజీ ఈ మేరకు టీమిండియా వైస్‌ కెప్టెన్‌కు అవకాశం ఇచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది.

కోహ్లి, డుప్లెసిస్ స్పెషల్ వీడియో(Smriti Mandhana)

స్మృతి మంధాన కెప్టెన్‌గా ఎన్నికైన విషయాన్ని ఆర్సీబీ మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, ప్రస్తుత కెప్టెన్‌ ఫాఫ్‌ డుప్లెసిస్‌తో సోషల్‌ మీడియా వేదికగా పంచుకున్నారు.

ఇరువురు క్రికెటర్లు స్మృతికి ఆల్‌ ది బెస్ట్‌ చెబుతూ ఇస్తున్న వీడియోను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తన ట్విటర్‌లో షేర్‌ చేసింది.

స్మృతి కెప్టెన్ ఎన్నికైన సందర్భంగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ పుల్ ఖుషీ అవుతున్నారు. అనుకున్నదే జరిగిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

జెర్సీ నెంబర్‌ 18 తమకు ప్రత్యేకమంటూ కోహ్లితో ముడిపెట్టి స్పెషల్ మీమ్స్‌తో సందడి చేస్తున్నారు. కాగా టీమిండియా స్టార్‌ ఓపెనర్‌గా మంధానకు ఉన్న ఫాలోయింగ్‌ పై స్పెషల్ గా చెప్పుకోనవసంర లేదు.

 

అందరి మద్దతు కావాలి: స్మృతి

ఆర్సీబీ మహిళా జట్టు కెప్టెన్‌గా ఎంపికకావడం అద్భుతమైన ఫీలింగ్‌ అని తన సంతోషాన్ని వ్యక్తం చేసింది స్మృతి మంధాన.

విరాట్, డుప్లెసిస్ విడుదల చేసిన స్పెషల్ వీడియోకు స్పందించిన స్మృతి.. విరాట్‌, ఫాఫ్‌ సారథ్యంలో జట్టు ఇప్పటికే తామేంటో నిరూపించుకుంది అని తెలిపింది.

ఆర్సీబీని విజయవంతంగా ముందు నడిపించడంలో తన వంతు కృషి చేస్తానని పేర్కొంది. మేనేజ్‌మెంట్‌ తనకు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని.. అందుకు కోసం అభిమానుల మద్దతు కూడా కావాలని కోరింది.

వేలంలో అత్యధిక ధరకు

మహిళల ప్రీమియర్​ లీగ్‌ -2023 వేలంలో స్మృతి మంధానను రికార్డు స్థాయిలో రూ. 3.40 కోట్లకు ఆర్పీబీ దక్కించుకుంది.

ఈ క్రమంలో తొలి వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ వేలంలో అత్యధిక ధరకు అమ్ముడుపోయిన క్రికెటర్‌గా స్మృతి మంధాన పేరు రికార్డులకెక్కింది.

ఇదిలా ఉంటే.. ఆర్సీబీ ఇటీవలే భారత టెన్నిస్‌ స్టార్‌ సానియా మీర్జాను తమ మెంటార్‌గా నియమించుకున్న సంగతి తెలిసిందే. కాగా మార్చి 4 నుంచి వుమెన్‌ ప్రీమియర్‌ లీగ్‌ ఆరంభం కానుంది.