Last Updated:

RCB vs KKR : సొంత గ్రౌండ్ లో బెంగుళూరుని చిత్తు చేసిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్.. కోహ్లీ పోరాటం వృధా !

ఐపీఎల్ 2023 లో భాగంగా బెంగ‌ళూరు లోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ సొంత మైదానంలో మరోసారి ఓటమి పాలైంది. నైట్ రైడర్స్ ఇచ్చిన 200 పరుగుల టార్గెట్ ని చేధించలేక బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై 21 పరుగుల తేడాతో ఓడిపోయింది.

RCB vs KKR : సొంత గ్రౌండ్ లో బెంగుళూరుని చిత్తు చేసిన కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్.. కోహ్లీ పోరాటం వృధా !

RCB vs KKR : ఐపీఎల్ 2023 లో భాగంగా బెంగ‌ళూరు లోని చిన్న‌స్వామి స్టేడియం వేదిక‌గా కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ తో జరిగిన మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ సొంత మైదానంలో మరోసారి ఓటమి పాలైంది. నైట్ రైడర్స్ ఇచ్చిన 200 పరుగుల టార్గెట్ ని చేధించలేక బెంగ‌ళూరు జ‌ట్టు నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల న‌ష్టానికి 179 ప‌రుగుల‌కే ప‌రిమిత‌మై 21 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో కేకేఆర్ చేతిలో బెంగళూరు రెండోసారి చిత్తుగా ఓడిపోయింది. బెంగుళూరు బ్యాట్స్ మెన్ లలో డుప్లెసిస్ (17 పరుగులు, 7 బంతుల్లో, 1 ఫోర్లు, 2 సిక్స్‌లు), మాక్స్‌వెల్ (5 పరుగులు, 4 బంతుల్లో, 1 ఫోర్) తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ జట్టు కష్టాల్లో పడింది. కెప్టెన్ విరాట్ కోహ్లీ (54 పరుగులు, 37 బంతుల్లో, 6 ఫోర్లు) ఆశలు రేపినా.. భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ లైన్ వద్ద వెంకటేశ్ ఐయ్యర్ అందుకున్న అద్భుతమైన క్యాచ్‌తో పెవిలియన్ చేరాడు.

ఆ తర్వాత మహిపాల్ లోమ్రోర్ 34 పరుగులు (18 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్స్‌లు), దినేష్ కార్తీక్ 22 పరుగులు (18 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్స్‌) చేశారు. ఆఖరి ఓవర్‌లో ఆర్‌సీబీ విజయానికి 35 పరుగులు కావాల్సి వచ్చాయి. వైభవ్ అరోరా వేసిన చివరి ఓవర్‌లో 13 పరుగులే రావడంతో ఆర్‌సీబీ ఓటమి ఖాయం అయ్యింది. కోహ్లీ అర్ధ‌ శ‌త‌కంతో రాణించిన‌ప్ప‌టికి మిగిలిన వారు విఫ‌లం అవ్వడం.. ఈ మ్యాచ్ లో బెంగుళూరు ఓడిపోవడానికి ప్రధాన కారణం అని చెప్పాలి. ఈ సీజన్‌లో కేకేఆర్ చేతిలో ఆర్సీబీకి ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. కోల్‌క‌తా బౌల‌ర్ల‌లో వ‌రుణ్ చ‌క్ర‌వ‌ర్తి మూడు వికెట్లు తీయ‌గా.. సుయాష్ శర్మ, ర‌స్సెల్ చెరో రెండు వికెట్లు ప‌డ‌గొట్టారు.

 

అంత‌క‌ ముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్‌క‌తా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల న‌ష్టానికి 200 ప‌రుగులు చేసింది. నైట్ రైడర్స్ బ్యాట‌ర్ల‌లో జేస‌న్ రాయ్‌ (56; 29 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్స‌ర్లు) హాఫ్ సెంచరీతో చెలరేగగా నితీశ్ రాణా(48; 21 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స‌ర్లు) రాణించాడు. జేసన్‌ రాయ్‌ (56 పరుగులు, 29 బంతుల్లో, 4 ఫోర్లు, 5 సిక్స్‌లు) ఆది నుంచే దూకుడుగా ఆడాడు. షాబాజ్‌ అహ్మద్‌ వేసిన ఆరో ఓవర్‌లో రెచ్చిపోయిన రాయ్‌.. హ్యాట్రిక్‌ సిక్స్‌లు కొట్టాడు. ఇన్నింగ్స్ చివర్లో నితీష్‌ రాణా (48 పరుగులు, 21 బంతుల్లో, 3 ఫోర్లు, 4 సిక్స్‌లు) అదరగొట్టడంతో పాటు రింకు సింగ్ (18 పరుగులు, 10 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్స్‌), వెంకటేశ్‌ అయ్యర్ (31 పరుగులు, 26 బంతుల్లో, 3 ఫోర్లు), నారాయణ్‌ జగదీశన్ (27 పరుగులు, 29 బంతుల్లో, 4 ఫోర్లు) కూడా బ్యాట్ ఝళిపించడంతో కేకేఆర్ జట్టు 200 పరుగులు చేసింది. బెంగ‌ళూరు బౌల‌ర్ల‌లో హ‌స‌రంగ, వినయ్‌ కుమార్ రెండు వికెట్లు తీయ‌గా, మ‌హ్మ‌ద్ సిరాజ్ ఓ వికెట్ ప‌డ‌గొట్టాడు.