Published On:

IPL 2025: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

IPL 2025: బెంగళూరుతో మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ఢిల్లీ క్యాపిటల్స్

Royal Challengers Bengaluru vs Delhi Capitals: ఐపీఎల్ 2025లో భాగంగా 18వ సీజన్‌లో ఇవాళ 24వ మ్యాచ్ జరగనుంది. బెంగళూరు వేదికగా చిన్నస్వామి స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో తొలుత టాస్ గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ ఎంచుకుంది.

 

ఇప్పటివరకు బెంగళూరు, ఢిల్లీ జట్ల మధ్య 31 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో బెంగళూరు 19 మ్యాచ్‌ల్లో గెలవగా.. ఢిల్లీ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఒక్క మ్యాచ్‌లో ఫలితం రాలేదు. ఇరు జట్ల మధ్య జరిగిన చివరి మ్యాచ్‌లో బెంగళూరు నెగ్గింది.

 

బెంగళూరు: విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవ్ దత్ పడిక్కల్, రజత్ పాటీదార్(కెప్టెన్, లివింగ్ స్టోన్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, కృనాల్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, హేజిల్‌వుడ్, యశ్ దయాల్.

ఢిల్లీ: ఫాఫ్ డుప్లెసిస్, జేక్ ఫ్రెజర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), అక్షర్ పటేల్(కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, అశుతోష్ శర్మ, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముకేశ్ కుమార్, మోహిత్ శర్మ.

 

ఇదిలా ఉండగా, ఇంపాక్ట్ సబ్స్ విషయానికొస్తే.. ఢిల్లీలో అభిషేక్ పొరెల్, దర్మన్ నల్కండే, కరుణ్ నాయర్, సమీర్ రిజ్వీ, డొనావన్ ఫెరీరా ఉండగా.. బెంగళూరులో సుయాశ్ శర్మ, రసిక్ సలామ్, మనోజ్ భండగే, జాకబ్ బెథెల్, స్వప్నిల్ సింగ్ ఉన్నారు.