India Vs England: భారత్ తో టెస్ట్ సిరీస్.. ఇంగ్లాండ్ ఫస్ట్ టెస్ట్ జట్టు ఇదే

England First Test Match Team: త్వరలోనే టీమిండియా ఇంగ్లాండ్ లో పర్యటించనుంది. అక్కడ దాదాపు నెలన్నర పాటు జరిగే దీర్ఘకాల టెస్ట్ సిరీస్ లో ఐదు మ్యాచ్ లు ఆడనుంది. కాగా ఈ సిరీస్ తోనే 2025-2027 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్ల మధ్య ఆసక్తికర పోరు జరగనుంది. కాగా ఇంగ్లాండ్ లో పర్యటించే జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఇప్పటి వరకు టెస్ట్ కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ టెస్ట్ కెప్టెన్సీకి వీడ్కోలు పలికాడు. అలాగే సీనియర్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సైతం టెస్ట్ ఫార్మట్ నుంచి తప్పుకున్నాడు. ఈ నేపథ్యంలోనే శుభ్ మన్ గిల్ సారథ్యంలో టీమిండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్తోంది.
కాగా ఇరుజట్ల మధ్య తొలి టెస్ట్ జూన్ 20 నుంచి 24న వరకు లీడ్స్ లోని హెడింగ్లీ స్టేడియం వేదికగా ప్రారంభం కానుంది. రెండో టెస్ట్ బర్మింగ్ హామ్ లోని ఎడ్జ్ బస్టన్ స్టేడియం వేదికగా జూలై 2 నుంచి 6 వరకు జరగనుంది. మూడో టెస్ట్ లండన్ లోని లార్డ్స్ స్టేడియంలో జూలై 10 నుంచి 14 వరకు జరగనుంది. అలాగే నాలుగో టెస్ట్ మాంచెస్టర్ లోని ఎమిరేట్స్ ఓల్డ్ ట్రాఫోర్డ్ వేదికగా జూలై 23 నుంచి 27 వరకు జరగనుంది. ఐదో టెస్ట్ లండన్ లోని కెన్నింగ్టన్ వేదికగా జూలై 31 నుంచి ఆగస్ట్ 4 వరకు నిర్వహించనున్నారు.
అయితే భారత్ తో జరిగే టెస్ట్ సిరీస్ లో ఫస్ట్ మ్యాచ్ కు సంబంధించిన జట్టును ఇంగ్లాండ్ ప్రకటించింది. బెన్ స్టోక్స్ కెప్టెన్ గా 14 మందితో టీమ్ ను ప్రకటించారు.
ఫస్ట్ టెస్ట్ కు ఇంగ్లాండ్ జట్టు:
బెన్ స్టోక్స్ (కెప్టెన్), షోయబ్ బషీర్, జాకబ్ బెథెల్, హ్యారీ బ్రూక్, బ్రైడన్ కార్స్, సామ్ కుక్, బెన్ డకెట్, జేమీ ఓవర్టన్, ఓలీ పోప్, జో రూట్, జేమీ స్మిత్, జోష్ టంగ్, క్రిస్ వోక్స్.