Published On:

Copper Water Benefits: రాగి పాత్రలో నీటిని త్రాగితే ఇన్ని ప్రయోజనాలా?

Copper Water Benefits: రాగి పాత్రలో నీటిని త్రాగితే ఇన్ని ప్రయోజనాలా?

Copper Water: భారతీయ సంసృతిలో రాగి పాత్ర చాలా ఉంది. పూజా విధానాలలో, ఆహారపు అలవాట్లతో పాటు నీటిని తాగడానికి రాగితో తయారు చేసిన వస్తువులను వాడేవారు. గతంలో రాగినాణేలు ఉండేవి. వాటిని నీటి ప్రవాహంలో జారవిడిచే వారు. ఎందుకంటే రాగి నీటిని శుభ్రపరుస్తుంది. నీటిలోని చెడు బ్యాక్టీరియాను చంపి మంచి బ్యాక్టీరియాను వృద్దిచేస్తుంది.

 

 

మనిషి శరీరంలో చెడు కొలస్ట్రాల్ తగ్గడం ఎంత ముఖ్యమో, మంచి కొలస్ట్రాల్ ఉండటం కూడా అంతే ముఖ్యం. అందుకుగాను రాగి పాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయి. మన పూర్వీకులు సన్నగా బలీష్టంగా ఉన్నారంటే అందుకు కారణం రాగి పాత్రల్లోని నీటిని త్రాగడం. ప్రస్తుత సమాజంలో నీళ్లు ప్లాస్టిక్ బాటిల్స్ లో వస్తున్నాయి. అందులో చెడు బ్యాక్టీరియా పెరగడం మాత్రమే జరుగుతుంది. తాజా పరిస్థితుల్లో ప్రజలు తమ ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద పెట్టారు. అందులో భాగంగానే నీటిని శుద్దిచేసే ప్రక్రియలో బాగంగా రాగి పాత్రలోనీటిని తాగాలన్న అభిరుచి మల్లీ చిరుగురించింది. ఇప్పటి వరకు ప్లాస్టిక్, స్టీల్ తో తయారు చేసిన చాలా పాత్రలు నీటిని స్టోర్ చేసుకోవడానికి మార్కెట్ లో వచ్చాయి. కానీ రాగి స్థానం మాత్రం చెక్కుచెదరలేదు.

copper vessel water benefits

copper vessel water benefits

 

తాతలకాలంనుంచి రాగి బిందెలోని నీళ్లు తాగాలని రాత్రి పడుకునే ముందు రాగి చెంబులో నీటిని పక్కనే పెట్టుకుని పడుకోవాలని, పొద్దున్నే లేచి ఆనీటిని తాగడంవలన ఆరోగ్యంగా ఉంటారని చెప్పేవారు. అది నూటికి నూరు పాళ్లు నిజం. ఎందుకంటే ఒక రాగి పాత్రలో నీటిని 5-6 గంటలు స్టోర్ చేయడం వలన దానిలో చెడు బ్యాక్టీరియా చనిపోయి మంచి బ్యాక్టీరియా అభివృద్ది చెందుతుంది. దీంతో ఆ నీటిని మనం తాగడం వలన శరీరంలో చెడు కొలస్ట్రాల్ తగ్గిపోయి మంచి కొలస్ట్రాల్ పెరుగుతుంది. ఇవి ఒక రకంగా ఔషధంగా పనిచేస్తాయి.

 

 

రాగినీరు…
రాగిపాత్రలో స్టోర్ చేసిన నీటిపై 2012లో NIHయొక్క నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ఓ అధ్యాయనాన్ని చేసింది. ఇది ఇచ్చిన నివేధిక ప్రకారం… రాగి నీరు ఎంత ప్రభావం చూపెడుతుందో తెలుసుకునేందుకు రిసెర్జ్ చేశారు. రాగి పాత్రలో ఉంచిన నీటిలో E.coil బ్యాక్టీరియా పెరగకుండా ఉంటుందని కనుగొన్నారు.

 

 

రాగి నీటిలో ఏముంది.?
రాగిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ – వైరల్ మరియు యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవి మన శరీరాన్ని లోపలి నుండి శుభ్రపరుస్తాయి. రాగికి క్రిములను చంపే శక్తి ఉందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనలో కనుగొన్నారు. రాగి పాత్రలో నీటిని కొన్ని గంటలు ఉంచితే, దానిలో ఉన్న కొన్ని హానికరమైన బ్యాక్టీరియా చనిపోతుంది.

 

copper vessel and jar water benefits

copper vessel and jar water benefits

 

ఆయుర్వేదం ప్రకారం, రాగి పాత్రలో ఉంచిన నీరు రక్తాన్ని శుభ్రపరుస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రణలో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ సరైన స్థాయిలో ఉన్నప్పుడు, గుండె జబ్బుల ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది బ్లాకింగ్, అధిక రక్తపోటు మరియు గుండెపోటు వంటి సమస్యలను నివారిస్తుంది. దీంతో పాటు, రాగి నీరు జీర్ణవ్యవస్థను కూడా బలపరుస్తుంది, దీని కారణంగా ఆహారం బాగా జీర్ణమవుతుంది మరియు శరీరానికి పూర్తి పోషకాహారం లభిస్తుంది. ఇది ఊబకాయాన్ని పెంచదు, ఇది రోగనిరోధక శక్తిని కూడా బలపరుస్తుంది, ఇది శరీరాన్ని వ్యాధులతో పోరాడటానికి వీలు కల్పిస్తుంది.

 

copper vessel jar water benefits

copper vessel jar water benefits

 

రాగి నీటిని ఎప్పుడు తాగాలి?
రాత్రి పడుకునే ముందు రాగి పాత్రలో నీటిని ఉంచాలి. ఈ నీటిన ఉదయం ఖాళీ కడుపుతో తాగాలి. ఇది గుండెను బలోపేతం చేయడమే కాకుండా, మొత్తం శరీరం యొక్క పనితీరును సమతుల్యంగా ఉంచుతుంది. గుండె జబ్బులు వేగంగా పెరుగుతున్న నేటి కాలంలో, ఈ సహజ నివారణ చాలా ఉపయోగపడుతుంది. పైగా ఇది చౌకైనది, సురక్షితమైనది, చాలా సంవత్సరాలుగా శాస్త్రీయంగా నిరూపితమైనది.

 

గమనిక : రాగి పాత్రలో నీటిని త్రాగడం వలన కలగే ప్రయోజనాలపై అవగాహన కల్పించడం కోసం మాత్రమే వ్రాయబడింది. రాగి పాత్రలో నీటిని త్రాగడం వలన వ్యాదులు నయం కావు. ఇది కేవలం ముందు జాగ్రత్తగా తీసుకునే చర్యలు మాత్రమే. ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే ఆరోగ్యానికి మరింత రక్షణ ఇవ్వాలి. పై ఆర్టికల్ అందులో భాగమే. కావున ఎవరకైనా ఏ సమస్యలు ఉన్నట్లయితే డాక్టర్లను సంప్రదించగలరు.

ఇవి కూడా చదవండి: