Iran- Israel War Updates: యుద్ధం మొదలైందన్న ఇరాన్.. అత్యాధునిక క్షిపణులతో దాడి..!
Iran Launched Hypersonic Missiles on Israel: ఇరాన్- ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకు ముదురుతోంది. ఇజ్రాయెల్ పై హైపర్ సోనిక్ మిసైళ్లతో ఇరాన్ విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ.. యుద్ధం మొదలైందని ప్రకటించారు. ఇవాళ తెల్లవారుజాము నుంచి క్షిపణులతో ఇజ్రాయెల్ పై విరుచుకుపడుతోంది. ఇవాళ అర్ధరాత్రి సుమారు 15 ప్రొజెక్టైల్స్ ఇజ్రాయెల్ లో పడ్డాయని స్థానికులు తెలిపారు. తర్వాత ఇరాన్ విమానాలు ఇజ్రాయెల్ లో చక్కర్లు కొట్టాయి. దీంతో సెంట్రల్ ఇజ్రాయెల్ తో పాటు వైస్ట్ బ్యాంక్ ఏరియాల్లో హైఅలర్ట్ ప్రకటించారు.
ఇరాన్ దాడులు చేస్తోందని, ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ఇజ్రాయెల్ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. సెంట్రల్ ఇజ్రాయెల్ లోని ఓ పార్కింగ్ ఏరియాలో బాంబు దాడి జరిగింది. ఘటనలో పెద్ద సంఖ్యలో కార్లు ధ్వంసమయ్యాయి. హైపర్ సోనిక్ మిసైళ్లను వాడినట్టుగా ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ ప్రకటించారు. ఆపరేషన్ హానెస్ట్ ప్రామిస్ లో భాగంగా ఫతాహ్-1 మిస్సైళ్లను వాడినట్టు ఇరాన్ వెల్లడించింది. కాగా ఫతాహ్-1 మిస్సైల్ దాడికి చెందిన విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైపర్ సోనిక్ ఫతాహ్ మిస్సైల్స్ సుమారు 1400 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించగలదు.