Vivo T4 Ultra 5G: ఈరోజే ఫస్ట్ సేల్.. వివో కొత్త ఫోన్ వచ్చేసింది.. ఇంత తక్కువకు ఎలా బ్రో..!

Vivo T4 Ultra 5G: టెక్ బ్రాండ్ వివో తన కొత్త స్మార్ట్‌ఫోన్ Vivo T4 Ultra 5G సేల్‌ను ఈరోజు నుంచి ప్రారంభించనుంది. ఈ ప్రీమియం ఫోన్‌లో 12జీబీ ర్యామ్‌తో సహా అనేక శక్తివంతమైన ఫీచర్లు ఉన్నాయి. వివో ఈ అల్ట్రా ఫోన్ 100x సూపర్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ వివో ఫోన్ గత సంవత్సరం విడుదల చేసిన Vivo T3 Ultra అప్‌గ్రేడ్ మోడల్. ఈ ఫోన్ సామ్‌సంగ్, వన్‌ప్లస్, షియోమి వంటి బ్రాండ్ల ప్రీమియం ఫోన్‌లతో పోటీ పడగలదు. ఈ ఫోన్ ఈరోజు అంటే జూన్ 18 నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌తో పాటు కంపెనీ అధికారిక ఈ-స్టోర్, ఇతర రిటైల్ స్టోర్‌లలో అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ మొదటి సేల్‌లో కంపెనీ అనేక రకాల బ్యాంక్ ఆఫర్లను అందిస్తోంది.
Vivo T4 Ultra 5G Offers
ఈ వివో ఫోన్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో వస్తుంది. దీనిని 8GB RAM + 256GB, 12GB RAM + 256GB,12GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. వివో T4 అల్ట్రా ప్రారంభ ధర రూ.37,999. అదే సమయంలో ఇతర రెండు వేరియంట్ల ధర వరుసగా రూ. 39,999, రూ. 41,999. ఇది మీటోర్ గ్రే, ఫీనిక్స్ గోల్డ్ కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టింది. మొదటి సేల్‌లో ఫోన్ కొనుగోలుపై రూ. 3,000 తక్షణ బ్యాంక్ డిస్కౌంట్ అందిస్తున్నారు.
Vivo T4 Ultra 5G Features
ఈ ఫోన్ 6.67-అంగుళాల 1.5K క్వాడ్ కర్వ్డ్ అమోలెడ్ డిస్‌ప్లేతో వస్తుంది. ఫోన్ డిస్‌ప్లే 120Hz రిఫ్రెష్ రేట్ ఫీచర్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్ 5000 నిట్‌ల వరకు పీక్ బ్రైట్నెస్‌కు మద్దతు ఇస్తుంది. ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ ప్రాసెసర్ ఉంది. దీనితో 12GB RAM + 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.
ఈ వివో ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఫన్‌టచ్ ఓఎస్ 15లో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో గూగుల్ జెమిని ఆధారంగా AI ఫీచర్లను ఉన్నాయి, ఇందులో సర్కిల్ టు సెర్చ్, AI ట్రాన్స్‌లేట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. కనెక్టివిటీ కోసం డ్యూయల్ 5G సిమ్ కార్డ్, వైఫై, బ్లూటూత్ 5.4, ఓటీజీ, జీపీఎస్, ఎన్ఎఫ్‌సి ఫీచర్లను చూడచ్చు. ఈ ఫోన్ IP64 డస్ట్, స్ప్లాష్ ప్రూఫ్‌గా ఉంటుంది. ఫోన్ మందం 7.45మి.మీ. వివో T4 అల్ట్రాలో 5,500mAh బ్యాటరీ ఉంది, దీనితో 90W టర్బో ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ అందుబాటులో ఉంటుంది.
ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంది. దీనికి 50MP మెయిన్ OIS కెమెరా ఉంది. దీనితో పాటు, 50MP పెరిస్కోపిక్ టెలిఫోటో కెమెరా అందుబాటులో ఉంటుంది, ఇది 100x సూపర్ జూమ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కాకుండా, ఫోన్‌లో 8MP వైడ్ యాంగిల్ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్‌లో సెల్ఫీ, వీడియో కాలింగ్ కోసం 32MP కెమెరా ఉంది.