IPL 2025 : లఖ్‌నవూపై టాస్ గెలిచిన పంజాబ్.. ఫస్ట్ బౌలింగ్

IPL 2025 : 2025 ఐపీఎల్ 18వ సీజన్‌లో బిగ్ ఫైట్ మొదలు కానుంది. లక్నోలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య కీలక పోరుకు మరికాసేపట్లో తెరలేవనుంది. టాస్ గెలిచిన శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. పవర్ హిట్టర్లతో ఉన్న రెండు జట్లలో పైచేయి సాధించేది ఎవరు? అనేది ఆసక్తికరంగా మారింది. లక్నోకు మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్ భారీ హిట్టర్లు ఉన్నారు. పంజాబ్‌కు ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శ్రేయస్ అయ్యర్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, శశాంక్ సింగ్ కొండంత బలం కానున్నారు.
తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటన్స్‌పై విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ అదేజోరు కొనసాగించాలని భావిస్తోంది. లక్నో తొలిపోరులో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో ఓడినా సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై విజయ ఢంకా మోగించింది. దీంతో ఈ మ్యాచ్‌లో విజయం ఎవరిని వరిస్తుంది? అనేది అభిమానుల్లో ఉత్కంఠ రేపుతోంది.
పంజాబ్ జట్టు : ప్రియాన్ష్ ఆర్య, ప్రభ్‌సిమ్రన్ సింగ్, శ్రేయాస్ అయ్యర్, శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, సూర్యాన్ష్ షెడ్గే, మార్కో యాన్సెన్, లాకీ ఫెర్గూసన్, యజ్వేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.
లక్నో జట్టు : మిచెల్ మార్ష్, ఎడెన్ మర్క్‌రమ్, నికోలస్ పూరన్, రిషభ్ పంత్, ఆయుష్ బదొని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, దిగ్వేశ్ సింగ్ రథీ, శార్థూల్ ఠాకూర్, అవేశ్ ఖాన్, రవి బిష్ణోయ్ ఉన్నారు.