IPL 2025 : ఇషాన్ సెంచరీ.. రాజస్థాన్ విజయ లక్ష్యం 287

IPL 2025 : 2025 సీజన్ ఆరంభంలోనే సన్‌రైజర్స్ టీం అదరగొట్టింది. రాజస్థాన్ రాయల్స్‌తో ఇవాళ హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లు చెలరేగారు. ఇషాన్ సెంచరీతో కదం తొక్కాడు. ఈ మ్యాచ్‌లో హైదరాబాద్ రికార్డు స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 286 పరుగులు చేసింది. ఇషాన్ 45 బంతుల్లో సెంచరీ కొట్టాడు. హెడ్ (67), నితీష్ (30), క్లాసన్ (34), అభిషేక్ (24) పరుగులు చేశారు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ 2 వికెట్లు తీయగా, సందీప్ 1, దేశ్‌పాండే మూడు వికెట్లు పడగొట్టాడు.