Published On:

CSK vs RCB: ఉత్కంఠ పోరులో చెన్నైపై ఆర్సీబీ గెలుపు

CSK vs RCB: ఉత్కంఠ పోరులో చెన్నైపై ఆర్సీబీ గెలుపు

CSK vs RCB: ఉత్కంఠ పోరులో చెన్నైపై బెంగళూరు గెలిచింది. నరాలు తెగేంత టెన్షన్ లో కోహ్లీ టీం విజయఢంకా మోగించింది. చివరి బంతి వరకు ఎవరు గెలుస్తారో చెప్పలేనంత ఉత్కంఠ నెలకొంది. రెండు పరుగుల తేడాతో చెన్నైని ఓడిచింది బెంగళూరు. శనివారం సాయంత్రం బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో చెన్నైతో ఢీకొంది ఆర్సీబీ. టాస్ గెలిచి ఫీల్డంగ్  ఎంచుకుంది చెన్నై. బ్యాటింగ్ కు దిగిన బెంగళూరు మొదటినుంచి దూకుడుగా ఆడింది. ఓపెనర్స్ రాణించారు. నిర్ణిత 20 ఓవర్లలో 213 పరుగులు చేశారు. 18 ఓవర్లలో బెంగళూరు స్కోరు 159పరుగులకు 5వికెట్లు కోల్పోయింది. అయితే చివరి రెండు ఓవర్లలో షెఫర్డ్ విద్వంసం సృష్టించాడు. 14బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. చెన్నై బ్యాటర్లు ఆయుష్, జడేజా పోరాటం చేయడంతో చెన్నైని గెలుపు అంచులవరకు తీసుకెళ్లారు. చివరి బంతికి 4పరుగులు అవసరం ఉండగా 2 పరుగుల తేడాతో ఆర్సీబీ విజయం సాధించింది.

 

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన ఆర్సీబీ ఓపెనర్లు శుభారంభాన్ని ఇచ్చారు. కోహ్లీ 33 బంతుల్లో 62పరుగులు, బెతెల్ 33 బంతుల్లో 55పరుగులు చేసి పఠిష్టమైన ఓపెనింగ్ ను నెలకొల్పారు. ఫేసర్లు, స్పిన్నర్లు అనే తేడా లేకుండా విరుచుకుపడ్డారు. వీరి ధాటికి స్కోరు బొర్డు పరుగులు పెట్టింది. పవర్ ప్లే లోనే ఆర్సీబీ 71పరుగులు చేసింది.

 

కరన్ వేసిన 12వ ఓవర్లో కోహ్లీ అవుట్ అయ్యాక ఆర్సీబీ వికెట్లు టపటపా రాలాయి. పడిక్కల్(17), జితేశ్ శర్మ(7), రజిత్ పాటీదార్(11) పెవిలియన్ చేరారు. మొదట్లో పటిష్టంగా ఉన్న బెంగళూరు సొంత స్టేడియంలో మరోసారి తడబడినట్లు అనిపించింది. అయితే రొమారియా షెఫర్డ్ ధాటికి నిలదొక్కుకుంది. 18ఓవర్లకు 159పరుగులు చేసి 5వికెట్లు కోల్పోయిన ఆర్సీబీకి చివరి రెండు ఓవర్లలో పరుగుల వరదను సృష్టించాడు షెఫర్డ్. ఖలీల్ వేసిన 19వ ఓవర్లలో నాలుగు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. ఈ ఓవర్లో 33 పరగులు పిండుకున్నాడు. ఒక నోబ్ తో సహా. పతిరన వేసిన చివరి ఓవర్లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టారు. 14బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేశాడు.

 

లక్ష్య చేదనలో భాగంగా బ్యాటింగ్ కు దిగిన చెన్నైకు ఓపెనర్ ఆయుష్ 48బంతుల్లో 94పరుగులు చేసి గెలుపుకు బాటలు వేశాడు. అయితే షేక్ రషీద్ 11బంతుల్లో 14, సామ్ కరణ్ 5 బంతుల్లో 5పరుగులు చేశారు. సెకండ్ డౌన్ లో వచ్చిన రవీంద్ర జడేజా ఆయుష్ తో కలిసి బెంగళూరు బౌలర్లకు చుక్కలు చేపించారు. జడ్డు 45 బంతుల్లో 77పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. డివాల్డ్ బ్రేవ్స్ డక్ అవుట్ కాగా, ధోనీ 8బంతులకు 12 పరుగులు, శివం దుబే 3బంతులకు 8పరుగులు చేశాడు. చివరి ఓవర్లో చెన్నై విజయానికి15పరుగులు అవసరమవగా మొదటి రెండు బంతుల్లో ఒక్కో పరుగును ఇచ్చిన దయాల్ మూడో బంతికి ధోనీని అవుట్ చేశాడు. నాలుగవ బంతి సిక్స్. దానికి తోడు నోబాల్. చివరి మూడు బంతుల్లో 6పరుగులు చేయాల్సి ఉండగా మూడు పరుగులే ఇచ్చాడు. దీంతో బెంగళూరు రెండు పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించి ఫ్లే ఆఫ్స్ కు చేరింది.

RCB Innings: బెతెల్ (సి) బ్రెవిస్ (బి) పతిరన 55; కోహ్లి (సి) ఖలీల్ (బి) కరన్ 62; పడిక్కల్ (సి) జడేజా (బి) పతిరన 17; రజత్ (సి) కరన్ (బి) పతిరన 11; జితేశ్ (సి) బ్రెవిస్ (బి) నూర్ 7; డేవిడ్ నాటౌట్ ; రొమారియో షెఫర్డ్ నాటౌట్ 53; ఎక్స్ట్రాలు 6 మొత్తం:  20 ఓవర్లలో 5 వికెట్లకు 213 పరుగులు;

బౌలింగ్: ఖలీల్ అహ్మద్ 3- 0-65-0; అన్షుల్ కాంబోజ్ 3-0-25-0; నూర్ అహ్మద్ 4-0-26-1; జడేజా 3-0-26-0; సామ్ కరన్ 3- 0-34-1; పతిరన 4-0-36-3

CSK Innings: ఆయుష్ (సి) కృనాల్ (బి) ఎంగిడి 94, షేక్ రషీద్ (సి) షెఫర్డ్ (బి) కృనాల్ 14; సామ్ కరన్ (సి) జితేశ్ (బి) ఎంగిడి 5; జడేజా నాటౌట్ 77; బ్రెవిస్ ఎల్బీ (బి) ఎంగిడి 0; ధోని ఎల్బీ (బి)  దయాళ్ 12; దూబె నాటౌట్ 8; ఎక్స్ట్రాలు 1, (20 ఓవర్లలో 5 వికెట్లకు 211 ;

బౌలింగ్: కృనాల్ 3-0-24-1; భువనేశ్వర్ 4-0-55-0; యశ్ దయాళ్ 4-0-41-1; ఎంగిడి 4-0-30-3; సుయశ్ 4-0-43-0; రొమారియో షెఫర్డ్ 1- 0-18-0