Published On:

Monsoon Health Tips: వర్షాకాలంలో పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచే.. బెస్ట్ టిప్స్ ఇవే !

Monsoon Health Tips: వర్షాకాలంలో పిల్లల రోగ నిరోధక శక్తిని పెంచే.. బెస్ట్ టిప్స్ ఇవే !

Monsoon Health Tips: వర్షాకాలం మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించినప్పటికీ ఇది పిల్లల ఆరోగ్యానికి మాత్రం అనేక సమస్యలను తెచ్చి పెడుతుంది. ముఖ్యంగా ఈ కాలంలో, వైరల్ ఇన్ఫెక్షన్, జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. పిల్లల రోగనిరోధక శక్తి పెద్దల కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సీజన్‌లో వారికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. వర్షాకాలంలో జలుబు, దగ్గు , ఇతర వైరల్ వ్యాధుల నుండి పిల్లలను రక్షించగల కొన్ని ప్రభావవంతమైన , సులభమైన హోం రెమెడీస్ వాడటం ముఖ్యం.

పసుపు పాలు:
రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు కలిపి పిల్లలకు ఇవ్వండి. పసుపులో యాంటీ బాక్టీరియల్ , యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.

ఆవిరి పట్టండి:
పిల్లలకి ముక్కు మూసుకుపోయి దగ్గు ఉంటే.. గోరువెచ్చని నీటి ఆవిరిని ఇవ్వండి. మీరు దానిలో ఒకటి లేదా రెండు చుక్కల యూకలిప్టస్ నూనెను కూడా కలపవచ్చు. ఇది మూసుకుపోయిన ముక్కును తెరిపిస్తుంది. అంతే కాకుండా శ్వాసకోశ వ్యవస్థకు ఉపశమనం కలిగిస్తుంది.

తులసి, తేనె మిశ్రమం:
4-5 తులసి ఆకులను మరిగించి.. దానికి కొద్దిగా తేనె కలిపి రోజుకు ఒకసారి పిల్లలకు ఇవ్వండి. ఇది దగ్గు, గొంతు నొప్పిని తగ్గించడంలో సహాయపడుతుంది.

తడి బట్టల నుండి రక్షణ:
వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరిపోవు. దీనివల్ల వాటిలో తేమ ఉంటుంది. అలాంటి బట్టలు ధరించడం వల్ల పిల్లల్లో జలుబు వస్తుంది. కాబట్టి పిల్లల బట్టలు పొడిగా, వెచ్చగా ఉండేలా చూసుకోండి.

మీ ఆహారాన్ని జాగ్రత్తగా చూసుకోండి:
పిల్లల ఆహారంలో విటమిన్-సి అధికంగా ఉండే నారింజ, ఉసిరి, నిమ్మకాయ మొదలైన పండ్లను చేర్చండి. ఇవి వారి రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి.

పాదాలను వెచ్చగా ఉంచండి:
ముఖ్యంగా రాత్రిపూట పిల్లలను సాక్స్ ధరించేలా చూసుకోండి. పాదాలను వెచ్చగా ఉంచడం వల్ల శరీర ఉష్ణోగ్రత సమతుల్యం అవుతుంది. అంతే కాకుండా చలి నుండి వారిని కాపాడుతుంది.

సకాలంలో డాక్టర్‌ను సంప్రదించండి:
జలుబు, దగ్గు మూడు రోజుల కన్నా ఎక్కువ కాలం కొనసాగితే లేదా జ్వరంతో పాటు ఉంటే.. హోం రెమెడీస్‌ పాటించడంతో పాటు డాక్టర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.