Cumin Water: బరువు తగ్గడానికి జీలకర్ర! ఎలావాడాలంటే..
బరువు తగ్గడానికి జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
cumin water for weight loss tips in telugu: ఉదయం ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగకుండా జీలకర్ర నీటిని తీసుకోవాలి. పరగడపున దీనిని తీసుకోవడం కంటే మరేదీకూడా ఉపయోగం ఉండదు. జీలకర్ర నీరు బరువు తగ్గడానికి జీవక్రియను వేగవంతం చేయడానికి పనిచేస్తుంది. ఊబకాయాన్ని తగ్గిస్తుంది. అనేక వ్యాధులను నాషనం చేయడానికి ప్రభావంతంగా పనిచేస్తుంది. ఇప్పటికే జీలకర్ర నీరు అనేవ వ్యాధులలో ప్రభావ వంతగా పనిచేస్తుందని నీరూపితం అయింది.
జీలకర్రలో యాంటీఆక్సిడెంట్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు సమృద్దిగా ఉన్నాయి. ఇది రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. జీలకర్ర నీరు తాగడం వల్ల గ్యాస్, ఆమ్లం, ఉబ్బరం సమస్య నుండి రిలాక్స్ అవుతుంది. అయితే మీరు టీ ని తాగకుండా ఉండాలి.
బరువు తగ్గడంలో జీలకర్ర నీరు సహాయపడటంతోపాటు నిల్వ ఉన్న కొవ్వు కరిగిస్తుంది. డయాబెటిస్ రోగులు ఉదయం పాలు టీకి బదులుగా జీలకర్ర టీ తాగాలి. ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది, ఇన్సులిన్‌ను మెరుగుపరుస్తుంది.
జీర్ణక్రియను మెరుగుపరచడానికి జీలకర్ర నీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందుకుగాను ఉదయం ఖాళీ కడుపుతో జీలకర్ర టీ తాగాలి. కడుపులో ఏ సమస్య ఉన్నా ఇది తొలగిస్తుంది. గ్యాస్, ఆమ్లత్వం, అజీర్ణ సమస్యలు ఉన్నవారు ప్రతీ రోజు ఉదయం జీలకర్ర టీ తాగాలి. ఇది అధిక కొలెస్ట్రాల్‌ను కూడా తగ్గిస్తూ ఆరోగ్య కరమైన ఫ్యాట్ ను రక్షిస్తుంది.
జీరా నీటిని ఎలా తయారు చేసుకోవాలి
గ్లాసు నీటిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి రాత్రంతా నానేలా ఉండండి. పొద్దున ఈ మిశ్రమాన్ని ఒక బౌల్ లో వేసి మరిగించండి. ఆతర్వాత చల్లారబెట్టండి. వడకట్టి నిమ్మరసం కలిపి తాగేయండి. నిమ్మరసం కలపడం మీ ఇష్టంపై ఆదారపడి ఉంది.
గమనిక.. పైన చెప్పిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. జిలకర నీటిని తాగేముందు ఆయుర్వేద డాక్టర్ సలహా తప్పక తీసుకోండి. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.