Published On:

IPL 2025 : గిల్, సుద‌ర్శ‌న్ హాఫ్ సెంచ‌రీలు.. గుజ‌రాత్ స్కోర్ 180

IPL 2025 : గిల్, సుద‌ర్శ‌న్ హాఫ్ సెంచ‌రీలు.. గుజ‌రాత్ స్కోర్ 180

IPL 2025 : ల‌క్నో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ ఇన్నింగ్స్ ముగిసింది. 20 ఓవర్లలో గుజరాత్ 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ల‌క్నో సొంత‌ మైదానంలో గుజ‌రాత్ జట్టు ఓపెన‌ర్లు దంచేశారు. ల‌క్నో బౌల‌ర్లను ఉతికారేస్తూ శుభ్‌మ‌న్ గిల్ (53) అర్ధ శ‌త‌కం సాధించాడు. మ‌రో ఓపెన‌ర్ సాయి సుద‌ర్శ‌న్ (51) సైతం దిగ్వేశ్ ర‌థీ బౌలింగ్‌లో బౌండ‌రీతో 50 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో లెఫ్ట్ హ్యాండ‌ర్‌కు ఇది 10వ ఫిప్టీ కావ‌డం విశేషం. టాస్ ఓడిన గుజ‌రాత్‌కు ఓపెన‌ర్లు శుభ్‌మ‌న్ గిల్(53), సాయి సుద‌ర్శ‌న్‌ (51)లు శుభారంభం ఇచ్చారు. ఇద్ద‌రూ దూకుడుగా ఆడుతూ స్కోర్‌బోర్డును ఉరికించారు. లఖ్‌నవూ బౌలర్లు రవి బిష్ణోయ్ 2, శార్దూల్ 2, అవేన్ ఖాన్ 1, దిగ్వేశ్‌సింగ్ ఒక వికెట్ తీశారు.

ఇవి కూడా చదవండి: