Published On:

IPL 2025 : స‌న్‌రైజ‌ర్స్‌కు బిగ్ షాక్.. ట్రావిస్ హెడ్ ఔట్

IPL 2025 : స‌న్‌రైజ‌ర్స్‌కు బిగ్ షాక్.. ట్రావిస్ హెడ్ ఔట్

IPL 2025 : ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో హైద‌రాబాద్ కీల‌క మ్యాచ్‌ ఆడుతుంది. హ్యాట్రిక్ ఓట‌మితో నిరాశ‌ప‌రిచిన క‌మిన్స్ సేన సొంత మైదానంలో గుజ‌రాత్ టైట‌న్స్‌‌తో త‌ల‌ప‌డుతోంది. టాస్ గెలిచిన గుజ‌రాత్ కెప్టెన్ శుభ్‌మ‌న్ గిల్ బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రెండు జట్లు రెండు మార్పులు చేశాయి. వాషింగ్ట‌న్ సుంద‌ర్ గుజ‌రాత్ టీమ్‌లోకి రాగా, హ‌ర్ష‌ల్ ప‌టేల్ స్థానంలో జ‌య‌దేవ్ ఉనాద్కాట్‌ను సన్‌రైజర్స్ తీసుకుంది. కాగా మొదటి ఓవర్లలోనే ట్రావిస్ హెడ్ ఔట్ అయ్యాడు. సిరాజ్ వికెట్ తీశాడు. దీంతో ప్రారంభంలోనే హైదరాబాద్ అభిమానాలు నిరాశకు గురయ్యారు.

ఈ మ్యాచ్‌లో టాప్ ఆర్డర్ విధ్వంస‌క ఇన్నింగ్స్ ఆడాల‌ని, మ‌ళ్లీ గెలుపు బాట ప‌ట్టాల‌ని హైదరాబాద్ భావిస్తోంది. ఉప్ప‌ల్ స్టేడియంలో రెండుజట్లకు ఇదే తొలి మ్యాచ్. కానీ, గ‌త మూడు మ్యాచుల్లో హైద‌రాబాద్‌పై గుజ‌రాత్‌దే పైచేయి. దాంతో, ఈసారి ఏం జ‌రుగనుంది? అని అభిమానుల్లో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

ఇవి కూడా చదవండి: