5 myths of weight loss: బరువు తగ్గడంపై 5 అపోహలు..! డాక్టర్లు చెబుతున్న నిజాలు ఇవే!

5 myths of weight loss in telugu: బరువు తగ్గాలనుకునే వారు తప్పుడు మార్గాలను ఫాలో అవుతున్నారని డాక్టర్ అల్తమాష్ షేక్ చెప్పారు. ఈయన ఎండోక్రినాలజిస్ట్ గా పనిచేస్తున్నారు. డాక్టర్ షేక్ చెప్పేదాని ప్రాకారం ఈయన ప్రతీ రోజు తప్పుడు డైట్ ను ఫాలో అయ్యేవారిని చాలా మంది తనకు ఎదురుపడుతారని చెప్పారు. బరువు తగ్గే క్రమంలో అపోహలను జనాలు బాగా నమ్ముతున్నారన్నారు.
భోజనం మానేయడం ద్వారా బరువు తగ్గవచ్చా?
భోజనం మానివేయడం ద్వారా జీవక్రియ క్షిణిస్తుంది. ఆ తర్వాత తినేటప్పుడు ఆకలి ఎక్కువ అవుతుంది. దీంతో ఎవరైనా అతిగా తింటారు, శరీరం కూడా అందుకు ప్రేరేపిస్తుంది. ఇలా కాకుండా… బరువు తగ్గాలనుకునే వారు ప్రతీ 3 – 4 గంటలకు ఒకసారి చిన్న చిన్నగా ఆహారాన్ని తీసుకోవాలని అంటున్నారు డాక్టర్ షేక్. ఇలా ఆహారం తీసుకోవడం వలన క్రమక్రమంగా బరువు తగ్గుతారని అంటున్నారు.
తక్కువ కాలరీలు తీసుకోవడం వలన ఎక్కువ బరువు పెరుగుతారా?
కాలరీలు తక్కువగా తీసుకుంటే కండరాలు నష్టపోతాయి. దీంతో పోషకాహార లోపం ఏర్పడుతుంది. మరియు జీవక్రియ కూడా తగ్గుతుంది. కాబట్టి, శరీరంలోని కొవ్వును సమర్థవంతంగా కరిగేంచేందుకు సమతుల్యం అవసరం. అయితే కేలరీలు ఎంత తగ్గాలి ఎలా తగ్గించాలి అనే విషయంపై డైటీషియన్ సలహాలు తప్పనిసరి పాటించాలి. సొంతనిర్ణయాలు తీసుకోకూడదు.
కార్బోహైడ్రేట్లు బరువు తగ్గడానికి మంచివికావా?
తప్పు. చెక్కెర ఇన్సులిన్ – స్పైకింగ్ వంటి శుద్ది చేసిన చక్కెర.. కార్బోహైడ్రేట్లను కొవ్వు పెరగడానికి కారణం అవుతాయి. పండ్లు, మిల్లెట్లు, చిక్కుళ్లు, ఓట్స్ వంటి సంక్లిష్ట కార్బోహైడ్రేట్లు శక్తిని అందిస్తాయి. కార్బోహైడ్రేట్లను పూర్తిగా తగ్గించడం కంటే లిమిట్ లో వాడుకోవాలి.
డిటాక్స్ డైట్ లు, జ్యూస్ లు తాగడం వలన ఫ్యాట్ తగ్గుతుందా?
ఇది ఒక అపోహ అని అంటున్నారు డాక్టర్ షేక్. ఈ అలవాట్లు కొవ్వు తగ్గడానికి అంతగా పనిచేయవు. జూస్ లలో ఫైబర్, ప్రోటీన్ తక్కువగా ఉండటం వలన కణజాలం తగ్గిపోతుంది. దీంతో ఆకలి మరింత ఎక్కువ అవుతుంది. అలాంటి పరిస్థితులో కడుపునిండా భోజనం చేస్తే ఫ్యాట్ తగ్గే చాన్స్ మామూలుగా అయితే ఉండదు. ఆహారాన్ని సరిగ్గా నమిలి తినడం వలన ఫ్యాట్ లెవల్స్ ఆటోమెటిక్ గా తగ్గుతాయని అంటున్నారు. ఇలా తినడం వలన ఎక్కువ తిన్నట్లు శరీరం గ్రహిస్తుందని, ఆపై పొట్టుతీయని బియ్యాన్ని భోజనంలో భాగం చేసుకోవాలని అంటున్నారు.
శరీరంలోని కొవ్వు ఒకేచోట వేగంగా తగ్గుతుందా?
అసాధ్యమని అంటున్నారు డాక్టర్లు. ఇలా చేయడం జరగని పని అంటున్నారు. వ్యాయామం చేయడం ద్వారా శరీరంలోని ఒకే చోట కొవ్వును కోల్పోరు. దీంతోపాటే కార్డియో, వెయిట్ లిఫ్టింగ్, సమతుల్యమైన ఆహారం తీసుకోవడం వలన శరీరంలోని కొవ్వు సమానంగా కరిగిపోతుంది.
గమనిక… పైన తెలిపిన విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే, నిపుణుల సలహా మేరకు మాత్రమే పాటించాలి. పై అభిప్రాయాలు డాక్టర్ల వ్యక్తిగతమైనవి. వాటిని చానల్ సపోర్ట్ చేయడం లేదు అలాగని ఖండించడం లేదు. కచ్చితత్వానికి చానల్ బాధ్యత వహించదు.