Published On:

Jasprit Bumrah: ఫిట్‌నెస్ కామెంట్స్‌పై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. దేవుడు రాసిపెట్టినంత కాలం ఆడుతా!

Jasprit Bumrah: ఫిట్‌నెస్ కామెంట్స్‌పై బుమ్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. దేవుడు రాసిపెట్టినంత కాలం ఆడుతా!

Jasprit Bumrah Powerful Statement To Injury: ఇంగ్లాండ్, భారత్ మధ్య లీడ్స్ వేదికగా హెడ్లింగ్స్ స్టేడియంలో తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మూడో రోజు భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లకు 90 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 471 పరుగులు చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో ప్రస్తుతం భారత్ 96 పరుగులు ఆధిక్యంలో ఉంది. అయితే, అంతకుముందు ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో భారత్ పేసర్ జస్పిత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టాడు.

 

అయితే, తన ఫిట్‌నెస్‌పై వస్తున్న నెగటివ్ కామెంట్స్‌పై బుమ్రా స్పందించాడు. కొంతమంది కామెంట్స్ చేస్తూనే ఉంటారు. అలాంటి నెగటివ్ కామెంట్స్‌ను పట్టించుకోనన్నారు. 12 నుంచి 13 ఏళ్లు ఐపీఎల్ ఆడానని, గాయాలవుతున్న ప్రతిసారి ఎవరో ఒకరు కామెంట్స్ చేస్తుంటారన్నారు. కెరీర్ ముగిసిందని అంటున్నారని, కానీ దేవుడు రాసిపెట్టినంత కాలం ఆడతానని బుమ్రా అన్నారు.

 

ఇక, ఫీల్డర్లు క్యాచ్‌లు వదిలేసినప్పుడు కాస్త నిరాశ చెందానని, కానీ ఎవరూ ఉద్దేశపూర్వకంగా క్యాచ్‌లు వదిలిపెట్టరని చెప్పుకొచ్చారు. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో చేసిన తప్పులు రిపీట్ కాకుండా రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్ చేస్తామని చెప్పారు. ఇదిలా ఉండగా, ఒకే ఇన్నింగ్స్‌లో ఎక్కువసార్లు 5 వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డుకెక్కాడు. అంతకుముందు కపిల్ దేవ్ పేరిట ఈ రికార్డు ఉండగా.. తాజాగా, కపిల్ దేవ్ సరసన బుమ్రా నిలవడంతో పాటు టెస్టుల్లో 150 వికెట్లు తీసిన తొలి ఆసియా పేసర్ కూడా బుమ్రా కావడం విశేషం.

ప్రైమ్9న్యూస్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి

Jasprit Bumrah Powerful Statement To Injury

ఇవి కూడా చదవండి: