Published On:

England vs India: ఇంగ్లాండ్, భారత్ తొలి టెస్ట్.. బుమ్రాకు 3 వికెట్లు!

England vs India: ఇంగ్లాండ్, భారత్ తొలి టెస్ట్.. బుమ్రాకు 3 వికెట్లు!

England vs India first test match Jasprit Bumrah three wickets: భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులకు ఆలౌట్ అయింది. రిషబ్ పంత్(134) సెంచరీ చేశాడు. అంతకుముందు గిల్(147), యశస్వీ జైస్వాల్(101) పరుగులు చేశారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జోష్ టంగ్, స్టోక్స్ చెరో 4 వికెట్లు పడగొట్టగా..బషీర్, కార్స్ తలో వికెట్ తీశారు.

 

అనంతరం ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ ప్రారంభించింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్ 3 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ ప్రస్తుతం 262 పరుగులు వెనుకబడి ఉంది. ఒలీ పోప్(100) సెంచరీతో కదం తొక్కగా.. డకెట్(62) పరుగులు చేశాడు. ప్రస్తుతం పోప్, హ్యారీ బ్రూక్ క్రీజులో ఉన్నారు. భారత్ బౌలర్లలో బుమ్రా మూడు వికెట్లు పడగొట్టాడు.

ఇవి కూడా చదవండి: