Published On:

R&AW Chief: ‘రా’ కొత్త చీఫ్ గా పరాగ్ జైన్.. ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర

R&AW Chief: ‘రా’ కొత్త చీఫ్ గా పరాగ్ జైన్.. ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర

R&AW Chief: భారత గూఢాచారులకు కొత్త బాస్ వచ్చారు. ప్రస్తుత ఆర్&ఆడబ్ల్యూ కార్యదర్శి రవి సిన్హా స్థానంలో పరాగ్ జైన్ నియమితులయ్యారు. పంజాబ్ కేడర్‌కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్. వీరు ఆపరేషన్ సిందూర్ లో కీలక పాత్ర పోషించారు. కాగా, రెండేళ్ల కాలానికి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ (రా&ఆడబ్ల్యూ) కొత్త చీఫ్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. జూన్ 30న పదవీకాలం ముగిసే ప్రస్తుత ఆర్&ఆడబ్ల్యూ కార్యదర్శి రవి సిన్హా స్థానంలో ఆయన నియమితులయ్యారు. వీరు ప్రస్తుతం ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) అధిపతిగా ఉన్నారు.

 

పాకిస్తాన్ సాయుధ దళాలపై కీలకమైన నిఘా సమాచారాన్ని సేకరించడం ద్వారా ‘ఆపరేషన్ సిందూర్’లో కీలక పాత్ర పోషించారు. ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ (ARC) అధిపతిగా జైన్ ప్రస్తుతం పనిచేస్తున్నారు. ట్రబుల్ షూటర్ గా ఈయనకు పేరుంది. సంఘర్షణ ప్రాంతాలలో ప్రధాన వ్యూహాలకు దోహదపడ్డారు. గతంలో చండీగఢ్‌లో SSPగా పనిచేశారు, కెనడా మరియు శ్రీలంకలో దౌత్య సంబంధమైన వాటిలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు.

 

జమ్మూ కాశ్మీర్‌లో గణనీయంగా ఉగ్రవాద నిరోధక నియామకాలను నిర్వహించారు. ఘర్షణ ప్రభావిత ప్రాంతంలో కేంద్రం వ్యూహానికి దోహదపడ్డారు. జూన్ 30, సోమవారం అధికారికంగా రా చీఫ్ గా బాధ్యతలు స్వీకరిస్తారు.

ఇవి కూడా చదవండి: