Published On:

Yashasvi Jaiswal: యశస్వీ జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ఏకంగా బ్రాడ్‌మన్‌దే!

Yashasvi Jaiswal: యశస్వీ జైస్వాల్ వరల్డ్ రికార్డు.. ఏకంగా బ్రాడ్‌మన్‌దే!

Yashasvi Jaiswal broken Bradman Record in test cricket: భారత యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ వరల్డ్ రికార్డు సృష్టించాడు. ఇంగ్లాండ్‌పై టెస్టుల్లో కనీసం 10 ఇన్నింగ్స్‌ల్లో 90కి పైగా సగటుతో పరుగులు చేసిన ఏకైక ప్లేయర్‌గా నిలిచాడు. యశస్వీ జైస్వాల్ ఇప్పటివరకు ఇంగ్లాండ్‌తో 10 ఇన్నింగ్స్‌లు ఆడగా.. 90.33 సగటుతో 813 పరుగులు చేశాడు. అంతకుముందు ఇంగ్లాండ్ టీంపై బ్రాడ్ మన్ 63 ఇన్నింగ్స్‌ల్లో 89.78 సగటుతో 5,028 రన్స్ చేశాడు. అలాగే డంప్ స్టర్ 88.42, లారెన్స్ 74.20, జార్జ్ 71.23 సగటుతో ఉన్నారు.

 

కాగా, లీడ్స్ వేదికగా హెడింగ్లీ స్టేడియంలో ఇంగ్లాండ్‌తో భారత్ తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. తొలి రోజు బ్యాటింగ్ చేపట్టిన భారత్ 3 వికెట్ల నష్టానికి 359 పరుగులు చేసింది. ఓపెనర్లు యశస్వీ జైస్వాల్(101), కేఎల్ రాహుల్(42) కీలక ఇన్నింగ్స్ ఆడారు. ఆ తర్వాత సుదర్శన్ (0) డకౌట్‌ అవ్వగా.. గిల్(127), పంత్(65) నాటౌట్‌గా క్రీజులో ఉన్నారు.

ఇవి కూడా చదవండి: