India vs England: ఇంగ్లాండ్, భారత్ తొలి టెస్ట్ మ్యాచ్‌కు వర్షం ముప్పు.. ఐదు రోజులూ కష్టమే!

Rain Effect to 1st Test match India vs England: ఇంగ్లాండ్, భారత్ మధ్య ఐదు టెస్టుల సిరీస్ నేటి నుంచి ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ మ్యాచ్ మధ్యాహ్నం 3.30 నిమిషాలకు లీడ్స్ వేదికగా హెడింగ్లీ స్టేడియంలో జరగనుంది. అయితే తొలిసారి గిల్ నాయకత్వంలో భారత్ జట్టు ఇంగ్లాండ్ బయలుదేరింది. ఈ యువ జట్టు తొలి విజయం సాధించాలని ఆరాటపడుతోంది. అంతకుముందు క్రికెట్ దిగ్గజాలు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే, ఈ మ్యాచ్‌కు వర్షం ముప్పు పొంచి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మరో రెండు రోజులు మాత్రం వర్షం పడవచ్చని వివరించింది. ఇప్పటికే లీడ్స్ పరిసర ప్రాంతాలు మేఘాలతో కమ్ముకున్నాయి. ఒకవేళ వర్షం పడితే బౌలింగ్‌కు అనుకూలంగా పిచ్ మారే అవకాశం ఉంది. దీంతో బ్యాటర్లకు పెద్ద పరీక్షగా మారే అవకాశం ఉంటుంది.
వరుసగా రెండు, మూడు రోజుల్లో ఉదయం గంటపాటు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆట కొనసాగే అవకాశం లేదు. అలాగే మూడు, నాలుగో రోజు చిరుజల్లులు పడే ఛాన్స్ ఉంది. ఇక, ఐదో రోజు ఔట్ ఫీల్డ్‌పై ఎఫెక్ట్ పడవచ్చని తెలిపింది. ఈ పరిస్థితుల్లో భారత్ నలుగురు పేసర్లను దింపే అవకాశం ఉంటుంది. దీంతో స్పీన్నర్లలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, కుల్ దీప్ యాదవ్‌లలో ఒక్కరికి మాత్రమే అవకాశం లభిస్తుంది.