Published On:

IPL 2025 31th Match: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు.. కోల్‌కతాతో పంజాబ్ ఢీ!

IPL 2025 31th Match: ఐపీఎల్‌లో మరో ఆసక్తికర పోరు.. కోల్‌కతాతో పంజాబ్ ఢీ!

Punjab Kings vs Kolkata Knight Riders IPL 2025 Today 31st Match: ఐపీఎల్ 2025లో భాగంగా ఇవాళ పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ సీజన్‌లో 31వ మ్యాచ్ జరగనుంది. ఛండీఘర్ వేదికగా రాత్రి 7.30 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఐపీఎల్ సీజన్‌లో ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య 33 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో కోల్‌కతా నైట్ రైడర్స్ 21 మ్యాచ్‌లు గెలవగా.. పంజాబ్ కింగ్స్ 12 మ్యాచ్‌ల్లో గెలుపొందింది. ఇక, గత సీజన్‌లో ఇరు జట్లు చెరో 4 విజయాలు దక్కించుకున్నాయి.

 

అయితే పంజాబ్ కింగ్స్‌ కీలక ఆటగాడు ఫెర్గూసన్ గాయం కారణంగా మ్యాచ్‌కు దూరమయ్యాడు. దీంతో పంజాబ్ కింగ్స్ జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అయితే మ్యాక్స్ వెల్ మంచి ఆల్ రౌండర్ ప్రతిభ కనబర్చడం పంజాబ్ జట్టుకు అనుకూలం కానుంది. మరోవైపు, కోల్‌కతా నైట్ రైడర్స్ బెస్ట్ యావరేజ్ కొనసాగించడంతో పాటు ఎకానమీతో బౌలింగ్ చేస్తుంది. మరి పంజాబ్ కింగ్స్ బ్యాటర్లు కోల్‌కతా నైట్ రైడర్స్ స్పిన్నర్లను ఎలా ఎదుర్కొంటారో చూడాలి.