England vs India: ఇంగ్లాండ్, భారత్ తొలి టెస్ట్.. భారత్‌కు 96 పరుగుల ఆధిక్యం

England vs India 1st Test Match, India lead by 96 runs: ఇంగ్లాండ్, భారత్ మధ్య లీడ్స్ వేదికగా తొలి టెస్ట్ జరుగుతోంది. అయితే మూడో రోజు వర్షం కారణంగా ఆట ముందుగానే ముగిసింది. వర్షపు చినుకులు పడడంతో ఆటను కొనసాగించేందుకు కష్టతరంగా మారింది. దీంతో అంపైర్లు కొంచెం ముందుగానే నిలిపివేశారు. అయితే స్టంప్స్ సమయానికి భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో ఓపెనర్ యశస్వీ జైస్వాల్(4), ఇక, సుదర్శన్(30) విఫలమయ్యారు. ప్రస్తుతం కేఎల్ రాహుల్(47), గిల్(6) క్రీజులో ఉన్నారు. ఇంగ్లాండ్ బౌలర్లలో బ్రైడెన్ కార్స్, స్టోక్స్ తలో వికెట్ తీశారు. ఇక, తొలి ఇన్నింగ్స్ కలుపుకొని భారత్ 96 పరుగుల ఆధిక్యంలో ఉంది.
అంతకుముందు, తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 471 పరుగులు చేయగా.. ఇంగ్లాండ్ 465 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో రెండో రోజు 3 వికెట్లకు 209 పరుగులు చేసింది. మూడో రోజు ఆటను ప్రారంభించి 465 పరుగులు చేసింది. ఈ ఇన్నింగ్స్‌లో ఓలీ పోప్(106), హ్యారీ బ్రూక్(99) పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడారు. అయితే బ్రూక్ సెంచరీ చేస్తాడని అందరూ అనుకున్నప్పటికీ ప్రసిద్ధ్ బౌలింగ్ క్యాచ్ ఇచ్చి నిరాశ పరిచాడు. బ్యాటర్లలో బెన్ స్టోక్స్(20), బ్రైడన్ కార్స్(22), జోష్ టంగ్(11) పరుగులు చేశారు. భారత బౌలర్లలో బుమ్రా 5 వికెట్లు పడగొట్టగా.. ప్రసిద్ధ్ 3 సిరాజ్ 2 వికెట్లు తీశారు.