Deepika Padukone: దీపికా పదుకొణెకు అరుదైన గౌరవం.. తొలి ఇండియన్ నటిగా రికార్డు

Deepika Padukone selected in Hollywood Walk of Fame 2026: బాలీవుడ్ నటి దీపికా పదుకొణె హాలీవుడ్ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. యాక్టింగ్ తో పాటు స్పీచ్ ఇవ్వడంలో తనకు తానే సాటి అని నిరూపిస్తుంది. తాజాగా, ఆమెకు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్ 2026’ గౌరవం దక్కించుకుంది. ఈ అరుదైన గౌరవానికి ఆమె ఎంపికైనట్లు హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధికారికంగా ప్రకటన వెల్లడించింది. ఈ మేరకు ఆమెకు మోషన్ పిక్చర్స్ విభాగంలో వరించింది.
అయితే, హాలీవుడ్ అందించిన ఈ ‘హాలీవుడ్ వాక్ ఆఫ్ ఫేమ్ స్టార్’ అవార్డు అందుకున్న తొలి ఇండియన్ యాక్టరెస్ కావడం గమనార్హం. కాగా, హాలీవుడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ విడుదల చేసిన లిస్టులో డెమి మూర్, రాచెల్ మెక్ ఆడమ్స్, ఎమిలీ బ్లంట్‌తో పాటు దీపిక పదుకొణె పేరు కూడా ఉంది. దీంతో ఆమె ఫ్యాన్స్ ఆనందంలో తేలిపోతున్నారు. మొత్తం 35 మందిని ఎంపిక చేసింది.
ఇదిలా ఉండగా, 2018లోనూ ఆమెకు అవార్డులు వరించాయి. టైమ్స్ మ్యాగజైన్ పబ్లిష్ చేసిన ‘100 మోస్ట్ ఇన్ ఫ్లూయెన్షియల్ పీపుల్’ లిస్టులోనూ దీపిక పదుకొణె స్థానం దక్కించుకుంది. అంతేకాకుండా , 2022లో ఫుట్ బాల్ వరల్డ్ కప్ ఆవిష్కరించడంతో తన పేరు ప్రపంచమంతా మార్మోగింది. 2023లో ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటునాటు సాంగ్ ను ప్రేక్షకులకు పరిచయం చేశారు. కాగా, XXX రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ సినిమాతో 2017లో ఆమె హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.